Feeds:
టపాలు
వ్యాఖ్యలు

Archive for the ‘politics’ Category


టామి అని,టైగర్ అని పేర్లుండడం చూసి మీకు మీరై ఇవి రెండూ వేర్వేరు జీవరాశులని ఊహించుకోకండి. రెండూ అక్షరాల పులులే. ఈ రెండు పులులు  చిత్తూరు కలెక్టర్ బంగళాలో కలుసుకున్నాయి. అప్పుడు ఆ రెండూ ఒకరికొకరు చెప్పుకొన్న ఆత్మకథలను క్లుప్తంగా ఇస్తాను. ఆతరువాత సంభాష్ణలోకి ఎళదాం
టామి టైగురుకు చెప్పుకున్న ఆత్మ కథ:
మా తాత ఒక టైగర్. ఆయన పేరు చెబితే  ఆ ప్రాంతమంతా హడల్. ఇప్పటికీ కొందరికి ఆయన పేరు చెప్పుకుంటే వళ్ళు పులకరిస్తుంది. కొందరికైతే వళ్ళు జలదరిస్తుంది. మా నాన్న కూడ ఒక టైగర్. మొదట జిల్లా లెవలు. ఆపై రాష్ఠ్ర్రం లెవల్లో ఎదగాలని అప్పట్లో ఆయన అభిమానులు తపించేవారు. అందుకు అదేదో పెద్ద సర్కస్ కంపెని ఉందని అందులో చేరితే అలా ఎదగొచ్చని సలహా ఇచ్చేవారు. అతనో సర్కస్ కంపెనిలో చేరాడు.
ఆ కంపెనికి దేశ వ్యాప్తంగా శాఖలుండేవి .మా నాన్న ఆంథ్ర ప్రదేశ్ శాఖలో చేరాడు. మా నాన్న పులే. కాని ఆ కంపెనిలో వృధాగా తిని కూర్చున్న  ముసలి నక్కలు ఆయన్ని బలే ఇబ్బంది పెట్టేవారు.
మా నాన్న తాను పుట్టి పెరిగిన  అడవి, అది తనకిచ్చిన స్వేచ్చ, భలం, ఆత్మవిశ్వాసం, దాని సౌందర్యం అన్ని తలచుకుని మదనపడుతూ రింగ్ మాస్టర్లు చెప్పిన విదంగా ఏవేవో ప్రోగ్రామ్స్ ఇచ్చేవాడు. జనం కూడా భాగానే మెచ్చుకునేవారనుకో. కాని ఈ రింగ్ మాస్టర్లు సర్కస్ ఓనరమ్మను కలిసి మా నాన్న ఇంకా ఆడవిని మరిచి పోలేదని, స్వేచ్చా జీవి అని, మొరటోడని ఎప్పటికైనా ఓనరమ్మకే ఎదురు తిరుగుతాడని పెద్ద ప్రోగ్రామ్స్ ఏవి ఇవ్వకూడదని చాడి చెప్పేవారు.
అప్పుడప్పుడు బఫూన్లను మా నాన్న మీద రింగ్ మాస్టరుగా నియమించేవారు. ఒక దశలో  ఈ అవమానాలు భరించలేక మరికొందరు పులులు ఇతరత్రా జంతువులతో ఆ సర్కస్ కంపెని వదిలి పెట్టి భయిటకొచ్చేసాడు. వీరందరు కలిసి చిన్న సర్కస్ కంపెని ఒకటి పెట్టేరు.
కాని ప్రకృతి నుండి దూరంగా దూరంగా వచ్చేసిన జనం, ఆహార వేటకు ఇరవై కిలో మీటర్లు తిరిగే శక్తి ఉన్నా పక్క వీథిలోని మెస్ కి టూవీలర్లో వెళ్ళి రోగాలు తెచ్చుకునే జనం
” నువ్వు సర్కస్లో ఎం చక్కా వార్తలు చదివేవాడివి, ఏం చక్క తోకతో పల్లు తోముకునేవాడివి .బంతాట ఆడేడివి ఆ సర్కస్లో నీ ప్రోగ్రామ్ బలే ఉండేదని” ఊరించేరు.
దీంతో విధిలేక మానాన్న అదే కంపెనిలో చేరారు.పెద్ద ఓనరమ్మ పోయి ఆమె కొడుకొచ్చాడు,కొడుకు పోయి కోడలొచ్చింది. కాని చాలా మంది మేధావులు ఆ సర్కస్ కంపెనియే చట్ట విరుద్దమని, సర్కస్ కంపెని నెపంతో స్కేమ్స్ చేస్తున్నారని అదని ఇదని దర్ణాలు,రాస్తా రోకోలంతా చేసేరు.
కంపెనికి బలే చెడ్డ పేరు వచ్చేసింది. కలెక్షన్ బాగా పడి పోయింది. రాష్ఠ్ర్రంలో  గూడారమే ఖాళి చెయ్యాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఆ తరుణంలో కొత్త ఓనరమ్మ  నీ మీద ఏ రింగ్ మాస్టర్లు ఉండరు , ఏం చేసినా నువ్వే అని చెప్పి హెడ్ ఆఫీసుకెళ్ళి పోయింది.
మా నాన్న అష్ఠ కష్ఠాలు పడి  ఇక్కడ ఉన్న గబ్బిలాలు, నక్కలు,తోడేళ్ళను మ్యేనేజ్ చేస్తూ ప్రోగ్రామ్స్ ఇస్తూ  కంపెనిని మంచి స్థాయికి తెచ్చేసాడు. ఈ ప్రయత్నంలో నేను అతని బిడ్డగా అతను అందుభాటులో లేనప్పుడు అతని ప్రతిథిగా చిన్నా చితకా ప్రోగ్రామ్స్ ఇస్తుండేవాడ్ని.  ఒక ఐదేళ్ళు ఏ సమస్యా లేకుండా పోయింది. మా నాన్న ఎంత పెద్ద పులి అయినప్పటికి అలవాట్లో పొరభాటుగా వై? (ఎందుకు?) అని ప్రశ్నించినా చివరికి ఎస్ అని చేసేవాడు. పులిబిడ్డనైన  నాకు సైతం టామి అని పేరు పెట్టారంటే చూసుకో.
కష్ఠాల్లో ఉన్న మెయిన్ బ్రాంచ్ పార్ట్నర్ షిప్పులు కలిసి క్రమేణా స్థిర పడటం మొదలైంది.మెయిన్ బ్రాంచ్  స్థిర పడేసరికి రాష్ఠ్ర్రంలోని బ్రాంచ్ రానింపు కొద్దిగా తగ్గింది. పాత సర్కస్ కంపెని ఒకటి టిక్కెట్ ఫ్రీ, పాప్ కార్న్ ఫ్రీ అని ప్రకటించడం ,  కొత్త సర్కస్  కంపెని ఒకటి కొత్తగా రావడం. అందులో రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి వంటి పెద్ద పెద్ద డైరక్టర్ల దగ్గర పని చేసిన ఒక పులి ఉండటం వల్ల ఇలా రానింపు తగ్గినా ఉనికికి ప్రమాదం రాకుండా ఉండేందుకు సర్కస్ కంపెని అడవర్టైజ్మెంట్ కోసం నేను ఒక టివి చానల్, దినపత్రిక పెట్టడంతో గండం గట్టెక్కింది.
దీంతో ఓనరమ్మ దీని పై దృష్ఠి సారించింది. పూర్వంలోలాగా పెత్తనం చెయ్య దలచింది.ఆ సమయానికి మా నాన్న ఓక కుట్రకు బలై పోయాడు. ఎలాగూ సర్కస్లోని జంతువుల గురించి భాగా తెలిసినవాడ్ని, మా నాన్నతో కలిసి మెలిసి పని చేసి వాటి లొసుగులు తెలిసిన వాడ్ని,జనం నాడి తెలిసినవాడ్ని , సర్కస్ దివాళా తీసి పోకుండా చానల్,పత్రిక నడిపిన వాడ్ని కాబట్టి నన్నే ఇన్ చార్జిగా పెడతారనుకున్నాను. ప్చ్! చివరికి నన్ను బఫూన్ చెయ్యాలని (చూ)చేసేరు.
దీంతో విసిగి పోయి ఇలా వచ్చేసాను.

టైగర్ టామికి చెప్పుకున్న ఆత్మ కథ:
అయ్యో పాపం! నీ కథ గనక వింటే గనక నా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూంది. నువ్వన్నావే కొత్త టైగర్ -కొత్త సర్కస్ కంపెని అని. ఆ టైగర్ ని నేనే. కొత్త కంపెని ఏమీ లాభసాటిగా నడవడం లేదు. సర్కస్ పెట్టిన కొత్తలో గోడ దూకి వచ్చినవారిలో సగం మంది  మొదటి  ఫోప్రారంభం కాక మునుపే వెళ్ళి పోయేరు. మిగిలిన సగం మంది అది  పూర్తికాక ముందే గోడ దూకి వెళ్ళి పోయేరు.
నువ్వా  సర్కస్ కంపెని వదిలి పెడితే ఆ సర్కస్ దివాళా తీయకుండా ఉండేందుకు నన్ను రమ్మన్నారు.  మీ నాన్నలాగే నేనూ ఒక అడవిలో రారాజుగా ఉన్నవాడ్నే. కాని ఆ అడవిలోకి కుర్ర పులుల రాకతో ఎక్కడ డి ఫేమ్ అయిపోతానోనని కొత్త సర్కస్ కంపెని పెట్టా బేడ్ లక్. ఇలా అయ్యింది . సర్లే పెద్ద కంపెని కదా చేరిపోదామని భయలు దేరాను. నీ మాటలు వింటుంటే గనక రేపు నా బతుకూ ఇంతేనేమో?
అన్నట్టు మనమిద్దరం కలిసి ఒక  సర్కస్ కంపెని పెడితే ఎలా ఉండేదో ఆలోచించు..
కొంత చర్చల అనంతరం టామి టైగర్ల మద్య ఒక అవగాహణ కుదిరింది. రెండూ చెట్టా పట్టాల్ వేసుకుని భయలు దేరాయి.  కలెక్టర్ సి.సి సిగరట్ తాగాలని వచ్చి ఈ రెండు పులుల ఐక్యతా  రాగం  విని  అదరి,వెదరి,చెదరి పరుగులు తీస్తూ వెళ్ళి కలెక్టరుగారికి విన్నవించాడు.
కలెక్టర్ వనికి పోతూ సర్కస్ కంపెనికి ఫోన్ చేసి కొత్త మ్యేనేజరుకు విషయం చెప్పాడు. కొత్త మేనేజర్  చేతులు కట్టేసుకుని, నోటి మీద వ్రేలు పెట్టేసుకుని హెడ్ ఆఫీసుకి ఫోన్ చేసి విషయం చెప్పగా చిర్రెత్తిన ఓనరమ్మ , ” వెంటనే కలెక్టర్ బంగళాకెళ్ళు ..రెండు ఫ్లాస్కులు తీసుకో .. ..తెచ్చి ఫ్రిడ్జిలో పెట్టేసుకుని ..రోజుకి మూడు పూట్లా సేవించు” అనేసి నెత్తి పట్టుకుంది.

Read Full Post »


నా వయస్సు 42 సం.లు. నేను 10 ఏళ్ళ వయస్సునుండే రాజకీయాలను గమనిస్తున్నాను. తమిళ తెలుగు బాషలు రెండూ వచ్చినందున తమిళనాదు,ఆంథ్ర రాజకీయాలను క్షుణ్ణంగ్గా గమనిస్తున్నాను. తమిళనాట పెరియార్ (రామస్వామి నాయ్క్కరైతే నిజాయితీగా మణియమ్మైని రెండో పెళ్ళి చేసుకున్నాడు. అయితే అన్నాదురై (మాజి సి,ఎం) కి నాటి నటి భానుమతితో సంబంధముండేదని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టేవి. ఇలా ఎన్నో విషయాలు ఈ బ్లాగులో పెట్ట దలచాను. మీ అభిప్రాయాలు తెలుప కోరుతున్నాను

Read Full Post »


కొన్నేళ్ళకు ముందు..అంటే అప్పట్లో విజయ బాపినీడు సక్సెస్ ఫుల్ డైరక్టరన్నమాట. అప్పత్లో దినపత్రికల్లో ఒక ప్రకటన వెలుబడింది. చిరంజీవి నటించగా విజయబాపినీదు దర్శకత్వం వహిస్తారని అందుకు కథ పంపాలని. స్క్రూటిని జరిగి కథ కూడ సెలక్ట్ అయినట్టుగా ప్రకతించారు గాని.ఆ కథేమిటి,ఆ రచియత ఎవరు ? ఇంతకీ ఆ రచయితకు పారితోషికమిచ్చారా లేదా? అంత హడావుడీ చేసి ఎందుకు సినిమా తీ లేదు..

Read Full Post »


ఈ సమస్థ విశ్వాన ఉన్న అన్ని జీవ రాశులకు మూలం స్రుష్ఠి ప్రారంభంలో ఉన్న ఏక కణ జీవియె. ప్రక్రుతిలో మార్చ లేని రూల్ ఒకటి ఉంది. అదేమంటే ఒక మూలమునుండి వచ్చిన వస్తువు ఎన్ని మార్పులకు గురైనప్పటికి తిరిగి తన సహజ స్థలికే చేరుతుంది. ఉ.నీరు..ఆకాశమ్నుండి వచ్చిన నీరు తిరిగి ఆకాశానికె చేరి,తిరిగి భూమి మీదికి చేరుతుంది. ఈ సైకిళ్ ఆగదు. ఇదేవిదంగా ఒక ఏక కణ జీవి నుండి వచ్చిన జీవరాశులన్ని మళ్ళి ఎకం కాక తప్పదు.

మళ్ళీ మమేకం కావలన్న ఉత్సుకత ప్రతి జీవిలోను ఉంటుంది. మనం కోళ్ళు,మేకలు తినడానికి కారణం కూడ ఇదే. మన ప్రతి ఒక్క చర్యలోను దాగి ఉన్న చంపె,చచ్చే కీరికలకు మూలం కూడ ఇదే .

స్రుష్టితో మమెకం కావాలి,ఈ స్రుష్థితో కమ్మ్యూనికేట్ చెయ్యాలి ,వ్యాపించాలి అన్న తత్వాలకు మూలకారణం కూడ ఇదే. సెక్స్,పిల్లలను విపరీతంగా కనడం, రచనలు,బ్లాగులు అన్నింటి వెనుక ఉన్నది ఇదే ఆరాటం. ఎవరిలోనైతే కేవలం సెక్స్ తో ఖాళి అయిపోనంత కాంక్ష (స్రుష్ఠితో విలీనం కావాలన్న) ఉంటుందో వారే సామాజిక,రాజకీయ విప్లవాలకు నాంది పలుకుతారు.

ఈ సోదన్ని చెప్పడం దేనికంటారు..అంతే గా..

జిడ్డు క్రుష్ణమూర్తి చెప్పారు.” లైఫ్ ఈస్ రిలేషన్షిప్”

నా బ్లాగును ఈ నిమిషం దాక 5000 మంది వీక్షించారని చెప్పటానికే ఇన్ని ఉపోద్ఘాతాలు.. విష్ మి బెస్ట్ ఆఫ్ లక్

Read Full Post »


ఆది లోన కుల మతాలు లేవు..వాడు వీడని తేడాల్లేవు. కాని ఆడ ,మగ కలిసినప్పుడు మగవానికి వీర్య స్కలనం జరిగే వేళ “ఓజస్సు” అను తేజము వివిద భాగాలలో ఏదో భాగమునుండి వీర్యంలోకి కలిస్తుంది. అది శిరస్సు నుండి కదిలి కలుస్తే బ్రాహ్మణ లక్షణాలు,భుజమునుండి కలుస్తే క్షత్రియ గుణాలు, ఇలా వివిద గుణాలు పుట్టే బిడ్డకు కలుగుతాయి. అప్పట్లో దగ్గర భందుత్వాల్లో వివాహాలు జరిగేవి కాబట్టి, జీను అదే కాబట్టి పుట్తిన ఆ బిడ్డల గుణాలే వారికి పుట్టే బిడ్డలకు కలుగుతూ వచ్చాయి. మానవుడు సంఘజీవి కాబట్టి సమాజ శ్రేయస్సుకై గుణాలను భట్టి వర్ణాలు ఏర్పరిచారు. ఒక క్లాసులో క్లెవర్స్,డల్లర్స్ అని గ్రూపులు విభజించనట్టే ఇదీను. కాని డల్లర్స్ ని పిక్ అప్ చెయ్యించటంలో అగ్ర వర్ణాల వారు ఫెయిల్ అయ్యేరు. దీంతో పౌరుల్లో కోట్లాది మంది విద్యకు దూరమయ్యేరు. వ్యాపారమే ముఖ్య జీవనంగా బ్రతికిన వైస్యులు,యుద్దమే పరమావదిగా బ్రతికిన క్షత్రియులు,వ్యవసాయం,శరీరిక కషఠంతో పొట్ట పోసుకునే శూద్రులు విద్యకు దూరమయ్యేరు. విద్యన్నది కేవలం బ్రాహ్మణులకె పరిమితమైంది.
దీంతో విథ్య కేవలం తమ అవసరాలకేనని భ్రమించిన బ్రాహ్మణులు సమాజములో ఇతర వర్గాలకు పనికొచ్చే విద్యా విదానాన్నినెలకొల్పక గాలికొదిలేసారు. పైగా ఉన్న కాస్తో కూస్తో విథ్యను సైతం టాప్ సీక్రెట్ గా ఉంచి భ్రష్ఠు పట్టించేసేరు. అందని ద్రాక్ష పులుపన్న చందాన ఇతర వర్గాలు విథ్యను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ వచ్చేసేరు.

Read Full Post »


మందా క్రుష్ణ మాదిగ ఏదో పెళ్ళికాని కన్యలా,వై.ఎస్.అతన్ని పెళ్ళి చేసుకుంటానని చెప్పి కడుపు చేసి వదిలి వేసినంతగా “దగా మోసం మోసం” అంటూ బురద చల్లుతున్నారు.

ఇంతకీ వర్గీకరణ అన్నది కేవలం మాదిగలకే సంభంధించిన విషయం కాదు. ఈ నిర్ణయంలో మాలల భవిష్యత్తుకూడ ముడిపడిఉంది. అయినా వై.ఎస్. క్రుష్ణ్ మాదిగకు మాట ఇచ్చారు. వై.ఎస్.ఒక మాటంటే అది తమ పరిదోదైతే వెంటనే చేస్తారు. తమ పరిదిలో లేనిదైతే దాని అమలుకు సాయ శక్తులా ప్రయత్నిస్తారు.

రాష్ఠ్ర స్థాయిలో నిర్ణయం తీసుకున్నారు. ఆదిష్ఠానాన్ని సైతం ఒప్పించే సత్తా వై.ఎస్. కు ఉంది.

ఈ మాటకు సైతం విపరీతార్థాలు తీస్తున్నారు.రాష్ఠ్ర నాయకత్వాలను గౌరవించకుంటే, తెలుగు గౌరవాన్ని డిల్లీలో కుదువ పెట్టారని గోల చేస్తారు. గౌరవిస్తేనో కేంద్రానికి ముడుపులంటారు.

ఒక అనుమానం: అప్పట్లో చంద్రబాబు కేంద్ర స్థాయిలో చక్రం తిప్పేవారుగదా ..అప్పట్లో బాబు ముడుపులు గిడుపులు అందించే పనులు చేయించుకున్నారా.?

కాంగ్రెస్ పార్టికి 2/3 మెజారిటియే గాని ఉండి ,వర్గీకరణ సాధ్యం కాకుంటే అది సోనియా భాధ్యత,వై.ఎస్. భాధ్యత.

మరి కేంద్రంలో నడిచేది కాంగ్రెస్ పాలన కాదు. యు.పి.ఎ.ప్రభుత్వ పరిపాలన. ఇందులో వై.ఎస్. సోనియాకున్న అవకాశాలు అంతంత మాత్రమే.

అయినా పాజిటివ్గా ఆలోచించి చేదాంలే అని బాసట కల్పించిన పాపానికి వై.ఎస్.ను ఆడిపోసుకుంటున్నారు.

ఒక నాయకుడు తన కార్యకర్తలకు మార్గదర్శకం చేసే స్థాయిలో ఉండాలి. వారిపై నియంత్రన పొంది పొంది ఉండాలి. కాని క్రుష్ణ మాదిగ తన పై వస్తున్న వ్యక్తిగత ఆరోపణలతో టెన్షన్ పదిపోయి తన ఉనికిని చాటుకోవడం కోసం ఇలా రాద్దాంతం చెయ్యడం మిత్ర ద్రోహం.

అలనాడే వర్గీకరణ సాధ్యం కాదని వై.ఎస్.తేల్చి యుంటే మాలలన్నా వై.ఎస్.పక్షం వహించే వారుకదా?

నేడు ..అటు మాలలను తన కారణంగా పోగొట్టుకున్న వై.ఎస్.నుండి మాదిగలను కూడ దూరం చేయ చూస్తున్న మందా క్రుష్ణమాదిగ తను కూర్చున్న కొమ్మను నరుక్కుంటున్నాడు.
ఇంతకీ మరో సంగతి ఏమంటే కులాలకు ప్రాతినిద్యం వహిస్తున్నామని గొప్పలు చెప్పుకునే వారు ఆ కులంలోని ప్రతి ఒక్కరు తమ ఆదీనంలో ఉన్నట్టు తెగ ఫీలైపోతారు. ఇవేవి తమకవసరం లేదంటూ తమ బతుకు తాము బతుకుతున్నవారే అనేకం. ఈ సత్యం తెలీకనో,తెలిసీ పైకి ఎలా చెప్పడమన్న జంకుతోనో కుల రాజకీయాలు జరిగిపోతూ ఉంటాయి.

భారత దేశాన ఉన్నవి రెండే కులాలు. ఒకటి రోజుకి రూ.20 సైతం గిట్టుపాటు కాక ఆకలితో అలమటిస్తున్న భీద వర్గం. మరొకటి త్రిశంకు స్వర్గాన వేలాడుతున్న మద్యతరగతి వర్గం.
మూడో వర్గం ఉందికాని వారు కేవలం లక్షల్లో ఉంటారు.

దినపత్రికలు సైతం వారి కోణంలో,వారి పక్షంలో వార్తలు కథనాలు ప్రచురిస్తుండటం దురద్రుష్ఠకరం.

రూ.100 అప్పు తిరిగివ్వమన్నందుకు మిత్రుని ఇంటికి నిప్పట్టించిన యువకుడు, రూ 300 అప్పు తిరిగివ్వమన్నందుకు అన్నను చంపిన తమ్ముడు..

ఇవి ఈ రెండురోజుల్లో వెలుబడ్డ క్రైం వర్తలు. (చిత్తూరు జిల్లా). ఇక ఎన్ని జిల్లాలు,ఎన్ని రాష్ఠ్రాలు,ఆ రష్ఠ్రాల్లో ఇంకెన్ని జిలాలు..

ఇటువంటి వారిని ద్రుష్ఠిలో పెట్టుకుని వై.ఎస్.ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేశ్తూ, దేశంలోని 70 శాతం ప్రజలను పోషిస్తున్న వ్యవసాయ రంగానికి కీల్కమైన సాగు నీటి సమస్య కొరకు జలయజ్ఞం చేపడుతుంటే ,ఇందులో అత్యధికంగా అనగారిన వర్గాలే లభ్ది పొందుతుంటే ప్రభుత్వానికి బాసటగా నిలవ వలసిన క్రుష్ణమాదిగ “ఎవరి లోకం వారిది గురుదేవా అన్నట్టు”వర్గీకరణను పట్టుకుని వేలాడుతున్నారు.

సందిట్లో సడేమియా అంటూ తె.దె.పా కు చెందిన కడియం శ్రీహరి తాము పరిపాలనకు వస్తే వర్గీకరణపై పొడుస్తామంటున్నారు.

వీరు బా.జా.పాతో కలవరు,కాంగ్రెస్తో కలవరు, మూడో ఫ్రంటు అంటునారు. మరి దానికి రాగలవి 1 నుండి 90 ఎం.పి .సీట్లే..వాటిని పెట్టుకుని ఎలా పార్లమెంటులో బిల్లు పెడతారు ,పొడుస్తారు అర్థం కావడం లేదు.

ఇక కేసి.ఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారు. అయ్యా! ఇది ప్రజాస్వామ్యం..మీ కోరికలను చెప్పడానికి,సాధించుకునేందుకు ఎన్నో మార్గాలున్నాయి. వాటినంతా విస్మరించి ఒక జాతీయ పార్టి కార్యాలయంలో దొగల్లా దూరి భీబత్సం స్రుష్ఠించడం సబబని భావిస్తున్నారా.. ఆ ప్రక్రియలో ప్రాణ నష్ఠం జరిగితే అందుకు వై.ఎస్.దే భాధ్యతంటారా?

తమిళనాడుల్0 పాట్టాలి మక్కల్ కచ్చి వారు పార్టిపెట్టిన కొత్తలో భంధ్ నిర్వహణ కొరకు వేలాది చెట్లను నరికి రోడ్ల పై వేశి ఏదో గొప్పగా సాధించినట్టు ఫీలై పోయారు. కాని ఆ బ్యేడ్ ఇమేజిని ,లక్షలాది చెట్లు నాతినా,ఇన్ని దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ పూర్తిగా మార్చుకోలేక పోతున్నారు.

హింస రెండు ప్రక్కలా పదునున్న కత్తి ,కత్తి పట్టినవాడు కత్తితోనే నాశనమౌతాడన్నది బైబుల్ వాక్కు. తస్మాన్ జాగ్రతా
ఈ పద్దతుల్లో తమ లక్ష్యాన్ని త్వరగా సాధించుకోవచ్చన్న అపోహ ద్రుష్ణ మాదిగలో ఉన్నట్టుంది. అది కేవలం అపోహే.. ఈ పద్దతుల కారణంగా వర్గీకరణ ఉధ్యమం పై ప్రజలకున్న సానుభూతిని సైతం పోకొట్టుకుంటారు.ఉధ్యమం మరో 20 సం.లు వెనుక బడుతుందని గుర్తించండి.

కేవలం ఒక నటుడిగా పేరున్న చిరుకు బూస్ట్ అప్ ఇవ్వడం కొరకు ఆంథ్రజ్యోతి “బాడుగ నేతలు” శీర్షికన మీ త్యాగాన్ని,పోరాట పటిమను తప్పుపపడితే ఎంతగానో భాధ పడినవాడ్ని.ఒక జర్నలిస్టునైయ్యుండి.. ఆంథ్రజ్యోతి కార్యాలయం పై మీ దాడిని కేవలం దురద్రుష్ఠకరం అని భావించిన వాడ్ని. అప్పుడూ,ఇప్పుడూ ఎప్పుడూ అదే పంథాలో ఆలోచించటం సిగ్గు చేటు.

మనిషి దైవానికి,మ్రుగానికి మద్యగల ఒక ప్రాణి. వీలైతే దైవత్వాన్ని పొందాలి గాని, పాశవికానికి దిగ జారకూడదు.

ప్రజలు గమనిస్తున్నారు..ప్లీజ్..మీ ఉద్యమాన్ని మీ చేతులారా మడమ తిప్పొద్దు.

Read Full Post »


ఆర్కుట్ గురించి తెలియని వారుండరు. ఇందులో రక రకాలైన అభిరుచులు గల వారు గ్రూపులుగా ఏర్పది ఉంటారు. వీరికి సందేశమివ్వాలంటే ఆ గ్రూపులోకి ప్రవేశించక తప్పదు.

ఇదివరకే చెప్పినట్టు ఆడవి దొంగ నుండి అల్లుడా మజాకా సినిమా వరకు నేనుసైతం చిరు అభిమానినే. అల్లుడా మజాకా సినిమాలోని బూతు డైలాగులు,అశ్లీల ద్రుశ్యాలతో విసిగి చిరుకు దూరమయ్యాను.

పాపం అభం శుభం తెలియని కుర్రాళ్ళు చిరు మాయలో కొట్టుకు పోయి బంగారు భవితను పోకొట్టుకుంటున్నారే అన్న భాధ తో చిరు గురించి నాలుగు మాటలు మెసేజ్ పెట్టాను.

అందుకు రక రకాలైన భూతులను స్క్రాబ్ చేస్తున్నారు. చంపుతామని,తంతామని బెధిరంపులు వేరు.

చిరు గారిని ప్రశ్నిస్తున్నా ! మీరు అరిచి గీ పెట్టే మార్పు ఇదేనా?
పి.సి.సి.ని తగుల పెడితే కాంగ్రెస్ వారు శాంతియుతంగా నిరశన వ్యక్తం చేస్తున్నారు.

మీ గురించి ఉన్న మాట చెప్పినందుకు మీ అభిమానులు భూతులు తిడుతూ చంపుతామంటున్నారు.

ప్రజలు ఇవన్ని గమనిస్తూనె ఉన్నారు.

చిరుగారు !
అందరు పార్టి పెట్టాక ,పొరబాతున గెలిచాక అవినీతికి పాల్పడుతారు ..కాని మీ విషయానికొస్తే పార్టి పెట్టి పెట్టకనే వసూళ్ళు జరిగినట్లు గా అరోపణలొస్తున్నాయి.

మిగిలిన పార్టిల్లో ఏ 5 సం.లకో మాత్రమే వలసలు జరిగేవి. కాని మీ పార్టిలో చేరిన కొన్ని నెలలకే వలస వెళ్ళిపోతున్నారు.

ఎన్.టి.ఆర్ హరిక్రుష్ణను కేవలం చైతన్య రథసారథిగా మాత్రమే వాడారు.

మీ పార్టిలో ఏమో పవన్,నాగ బాబు,అల్లు అరవింద్ తప్ప ఇంకెవ్వరికి ఏ పవరూ ఉన్నట్టు కనిపించటం లేదు.

సినిమాల్లో ఉంటూ కోట్లాది రూపాయల నల్ల దనాన్ని పారితోషికంగా స్వీకరించిన మీరు ఇప్పుడు అవినీతి గురించి మాట్లాడటం హేయంగా లేదా?

పోని మీ స్వంత ప్రాపర్టిని పరిటాల వద్దనుండి కాపాదుకో లేక చంద్రబాబుతో పంచాయితీ పెట్టి విఫలమయ్యారని ఒక సమాచారముంది.

మీ ఆస్తినే కాపాదుకోలేని మీరు రాష్ట్రాన్ని ఎలా కాపాడుతారు?

అయ్య! మీ కుటుంబంలోని ఇద్దరు స్త్రీలకు న్యాయం చెయ్య లేని మీరు రాష్ట్రంలోని మహిళాలోకానికి న్యాయం చెయ్యగలరని ఎలా నమ్మ మంటారు?
మీరే చెప్పారు..ప్రతి విమర్శకు పాల్పడమని సేవతోనే సమాదానం ఇస్తామని. ప్రతి విమర్శకాదు కదా మీ ప్రసంగాల్లో ముప్పావు సమయం విమర్శలు,ఆధారాల్లేనివిమర్శలకే,ఆరోపణలకే సరి పెడుతున్నారు.

రోజా అమ్మా అంటే షోబా రాణి నీయమ్మా అనే స్థితిలో మీ పార్టి ఉంది. మీ అభిమానుల్లో,మీ మహిళారజ్యం నేతల్లోనే మార్పు తే లేని మీరు మార్పు తెస్తానంటే ఎలా నమ్మమంటారు.

పథకాల అమల్లో అవినీతి జరిగిందన్నా అది అతికినట్టుంటుంది. మీరేమో అవినీతి కోసమే పథకాలు అమలవుతున్నాయంటున్నారు.

వికలాంగుల పట్ల ఎంతో శ్రద్ద చూపిన మీ పార్టిలో మీరు అధికార ప్రథినిధిగా నియమించిన పరకాల ప్రభాకర్ వికలాంగుల మనోభావాలు దెబ్బ తినేలా మాట్లాడారు, ఈ విషయం పై మీ స్పందన ఏమిటో ఇందాకా వెలుబడ లేదు..
చెరో చేనల్,చెరో పేపరు పెట్టుకుని స్వంత డబ్బా కొట్టుకుంటూ,వై.ఎస్., జగన్,సాక్షి పత్రికల పై నిందాపనిందలను వేస్తున్నారు. మీరు రాజకీయ ప్రవేశం చెయ్యడానికి కొన్ని నెలలనుండి ఆంథ్ర జ్యోతి మీకు విపరీత ప్రచారం ఇచ్చింది. దీనికి గాను వారేం ఆసించారు? మీరు దేనిని తిరస్కరించారు? ఆ దేవునికే ఎరుక..

ఇప్పటికైనా సరే వసూలు చేసిన డబ్బులు ఆయా నేతలకు వెనక్కిచ్చి తప్పుకొండి. చూడటానికి వచ్చిన జనమంతా ఓట్లేస్తారని భ్రమిస్తే షెడ్ అయిపోతారు.

వై.ఎస్.అమలు చేసిన పథకాలతో ప్రతి కుటుంభంలో కనీశం ఒక్కరన్న లబ్ది పొందియున్నారు. మన ప్ర్జలకు జ్ఞాపక శక్తి ఎక్కువ. క్రుతజ్ఞతా భావం ఎక్కువ. మీరు రేపొచ్చి ఇస్తానంటున్న వాతికన్నా,చేస్తానన్న వాటికన్నా ఇది వరకే తాము పొందిన వాటినే గుర్తు పెట్టుకుంటారు.

(మీకో రహస్యం చెప్పనా ..మీరు ఎంత బాగా తిరిగితే వై.ఎస్.కు అంతగా లాభం చేకూర్చిన వారవుతారు. వ్యతిరేక ఓట్ల మీద ఆశతో తె.దే.పా బరిలో ఉంది. ఆ వ్యతిరేక ఓట్లను మీరు ఎంతగా చీచితే వై.ఎస్.,కాంగ్రెస్ పార్టీలకు అంతగా లాభం..కీప్ ఇట్ అప్)

Read Full Post »

బయో డేటా


కుప్పం నియోజిక వర్గాన ఎమ్.ఎల్.ఏ.అభ్యఎదిగా పోటి చేసే అవకాసం కోరుతూ

బయో డేటా

పేరు: ఎస్.మురుగన్
కలం పేరు: చిత్తూరు.ఎస్.మురుగేషన్
(ఇప్పటికే నేను రచయితనన్న మాట అర్థమైయ్యుంటుంది)
ప్రధాన వ్ర్రుత్త్తి : జ్యోతిష్యం మరియు రచనా రంగం +జర్నలిజం
ప్రస్తుతం: తమిళ దినపత్రిక దినతంది
పుట్టిన తేది: 07-08-1967
విథ్యార్హత: బి.కామ్ (III) Disc
మాత్రు భాష: తమిళం
ఇతర భాషల పై పట్టు: తెలుగు,హింది
తెలుగులో: కథ,కవితా రచన,ఆంథ్రప్రభలో రిపోర్టరుగా 2సం.

1987 నుండి వార్షిక కార్యక్రమాలు:
1987 నుండి 1991 దాక: జ్యోతిష్య శాస్త్రం పై అద్యయనం
భారత దేశపు సమస్యల పై అద్యయనం
నదుల అనుసందానమే ముఖ్యోద్దేశంగా
ఒక పరిష్కారార్థం అన్వేషణ
1991 : కులాంతర వివాహం

1992: మొట్ట మొదటి సారిగా రక్త దానం (ఇక్కడ నుండి ప్రతి ఏటా రెండుసార్లు రక్త దానం. చివరగా 2002 రక్త దానం చేయడం కొరకు వెళ్ళినప్పుడు సంవత్సరానికి ఒక సారి ఇవ్వండి అని డాక్టర్లు సలహా ఇవ్వడంతో నేటి దాక ఏట ఒక సారి రక్త దానం ఇస్తూనే ఉన్నాను)

1993: భారత దేశపు సమస్యల పై అద్యయనానికి ,నిరుధ్యోగం + కులాంతర వివాహంతో ఎదురైన పేదరికం ఇచ్చిన చేదు అనుభవాలను జోడించి ఒక పరిష్కార మార్గాన్ని (ఆపరేషన్ ఇండియా 2000 పథకం) రూపొందించడం.
పథకంలోని స్థూలాంశాలు: 1,2,3,4,5

1997 నుండి 2002 దాక: నాటి సి.ఎమ్.గారికి పై పథకాన్ని పంపడం
క్రమం తప్పక రిమైండర్లు పంపడం
పత్రికా ప్రకటన ద్వారా నాటి సి.ఎం పై వత్తిడి

2002 వ సంవత్సరం ఏప్రల్ నెల: వ్యూహాత్మకంగా తిరుగు టపా ఖర్చుల నిమిత్తము
నాటి సి.ఎం చంద్రబాబు గారికి 10 రూ. ఎమ్.ఓ పంపడం
2002 మే నెలలో : వార్త దినపత్రిక లో అరటాపు పేజి కథనం “జీవన వైవిద్యం” విభాగంలో సామాజిక స్ప్రుహకు బాష్యం మురుగేషన్ శీర్శికన

2003 వ సంవత్సరం: నా పథకం పై స్పందించటానికి తిరుగు టపా ఖర్చుల నిమిత్తం రూ.10
స్వీకరించటం వలన అది పెయిడెడ్ సర్వీసైంది కాబట్టి స్పందించక పోవడంతో అది దెఫెసియన్సి ఆఫ్ సర్వీసు కావడంతో చిత్తూరు జిల్లా
వినియోగ దారుల ఫోరంలో ఫిర్యాదు

Read Full Post »


మీలో పలువురు వ్యాపారులు వ్యాపారాల్లేవని,పోటి పెరిగి పోయిందని లాభాల శాతం తగ్గి పోయిందని లావాదేవీలు కష్ఠ తరం అయిపోతున్నాయని ,ప్రభుత్వ ఉద్యోగులు ,శ్రీమంతులుసైతం అప్పులు ఎగ్గుడుతున్నారని మథన పడుతున్నారు. నష్ఠాల ఊభిలో చిక్కుకు పోతున్నారు.మీ వ్యాపార ,కుటుంభ ఖర్చులను తగ్గించుకోలేక ఆదాయాన్ని పెంచుకోలేక సతమతమవుతున్నారు.

ఈ పరిస్థితికి ఎన్నో కారణాలున్నాయి.అయితే కీలకమైన కారణం మాత్రం ఒక్కటే. అది డబ్బు గురించిన నిజాలు మీకు తెలియక పోవడమే. డబ్బు గురించిన సత్యాలు తెలియక ప్రజల్లో ఎక్కువ శాతం మంది దానిని దుర్వినియోగం చేస్తున్నారు. శరీరంలో రక్తం లా
మార్కెట్ లో నిరాటకంగా చేతులు మారవలసిన డబ్బు ,కొందరి అవగాహణా రాహిత్యం వలన డంప్ అయిపోతుంది. పక్క దోవ పడుతుంది.

మీ వ్యాపారాలు సక్రమంగా సాగాలంటే ,ప్రజల్లో డబ్బు గురించిన అవగాహణ పెరగాలి. ప్రజల మాట అటుంచితే వ్యాపారులైన మీలో కూడ చాలా మంది డబ్బు గురించిన సత్యాలు ,మర్మాలు,రహస్యాలు తెలీక లేని పోని సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు.
నష్ఠాల పాలవుతున్నారు. ఈ దుస్థితి కొనసాగితే మీ పరిస్త్థితి మరింత ఆందోళనకరంగా మారుతుంది.

ఈ దుస్థితిని మీతో పాటే ప్రజలు కూడ అధిగమించ వలసిన అవసరం ఎంతైనా ఉంది. ముందుగా మీకు ,ఆ తరువాత ప్రజలకు డబ్బు మీద,సంపాదన,పొదుపుల మీద అవగాహణ కల్గించటంకన్నా ఇరువర్గాల వారికి ఒక్క సారిగా అవగాహణ కల్పించాలని ఉద్దేశించాను.
అందుకే మా ఇండియన్ పొలిటికల్ క్లోసప్ పక్ష పత్రిక ఆద్వర్యంలో డబ్బు గురించిన
మానసిక,శారీరిక,ఆర్థిక,సాంఘిక,రాజకీయ,జ్యోతిష్య,మంత్రిక సత్యాలతో ఒక చిన్న బుక్ లెట్ విడుదల చెయ్యాలని నిర్ణయించాను.

మన తెలుగు దిన పత్రికల ఆదివారం స్పెషల్ సైజులో విడుదల కానున్న ఈ బుక్లెట్ లో మీ వ్యాపార ప్రకటనలకు చోటు కల్పించనున్నాం.

మా టారిఫ్:

Read Full Post »


అప్పట్లో కొత్త బిక్షగాడు పొద్దెరగడనన్నట్టుగా ఎన్.టి.ఆర్ పై చంద్రబాబు .వెన్నుపోటు అనంతరం జ్యోతిష్య రీత్యా లెక్కలు కట్టి ఫలానా తేది తరువాత శత్రువులే ఉండరని టెలిగ్రాం ఇచ్చాను.నా మాటలు నిజమయ్యాయి కాని అవి నిజమైన తీరే నాకు పిత్రు వియోగాన్ను ప్రసాదించింది. యుగపురుషుడిలా సిని రంగాన్ని,రాజకీయ రంగాన్ని ఎదురులేని మనిషిగా పేరొందిన ఎన్.టి.ఆర్ దివంగతులయ్యారు. ఆయనను అమాయకుడు చేసి వెన్ను పోటు పొడిచిన చంద్రబాబు సైతం నీరాజణాలు అర్పించారు. రాజకీయ ప్రత్యర్థులైన కాంగ్రెస్ నాయకులు సైతం ఆకాశమంతగా పొగిడేరు.

ఇక్కడ పిత్రు వియోగమని పేర్కొన్నాను. జన్మనిచ్చే వాడే తండ్రి కాదు వ్యక్తిత్వాన్ని,ఆత్మ విశ్వాశాన్ని,ఆత్మ గౌరవాన్ని,హూందాతనాన్ని,ఒక లక్ష్యాన్ని ప్రసాదించే వాడు కూడ తండ్రే .అవును నేను ఎం.టి.ఆర్ మానస పుత్రుడ్ని. ఆయన కన్న బిడ్డలంతా ఆయన ఆస్తులకు వారసులైతే నేను ఎన్.టి.ఆర్.శత్రు శేషానికి వారసుడ్ని. ఎన్.టి.ఆర్ శత్రుశేషాన్ని నేను తీరుస్తాను. ఇది ఈ నాడు నా బ్లాగు పై ఎన్.టి.ఆర్.అసలు సిసలైన రాజకీయ వారసుడు వై.ఎస్.ఆర్ స్పందించారన్న అతివిశ్వాసంతో అనే మాటలు కావు. ఏనాడో గైకొన్న కర్తవ్యం .

ప్రపంచంలోకెల్లా ఎన్.టి.ఆరే బలవంతుడన్న భ్రమ ఉండేది నాలో. 27 సం.ల వయస్సొచ్చినా ఎన్.,టి.,ఆర్ వంటి ముక్కు సూటితనం,క్రుషి, పట్టుదల ,క్రమ శిక్షణ అలవరుచుకుంటే చాలు జీవితంలోని సవాళ్ళను విజయవంతంగా ఎదుర్కోవచ్చు, ఎంతటి ఉన్నత స్థాయికన్న ఎదగవచ్చనే విశ్వాసం నాలో ఉండేది. కాని చంద్రబాబు అంతటి మహా వ్యక్తిని కేవలం విశ్వాస ఘాతుకంతో,వెన్నుఫోటుతో,నక్క జిత్తులతో ఆయన నమ్మిన భంటువులచేత చెప్పుతో కొట్టించిన వైనాన్ని జీర్ణించుకోలేక పోయాను.

నా జీవితంలో నేను ఎదుర్కొన్నా పెద్ద సంకర్షణ అది. ఆ జంక్షన్ పాయింటులో ఒకటి నేను బాబు లా నక్క జిత్తులు నేర్వాలి. లేదా ఎన్.టి.ఆర్ నేర్పిన వ్యక్తిత్వాన్ని,ఆత్మ విశ్వాశాన్ని,ఆత్మ గౌరవాన్ని,హూందాతనాన్ని,ఉపయోగించి బాబు బండారాన్ని భయిట పెట్తాలి. ఎన్.టి.ఆర్ జీవిత చరిత్రలో చోటు చేసుకున్న ఆ అమానుష మలుపుకు కారకులైన బాబును చరిత్ర హీనుడని రుజువు చెయ్యాలి.

నా కన్న తండ్రి రక్తంలోని నిజాయితి నక్క జిత్తులను అలవరుచుకోవడం కంటే మరణమే మిన్నా అంది. బాబుకు తగిన గుణ్పాఠం నేర్పాలని ఎన్.ట్.ఆర్. ఆత్మ ఘోషించింది.

వివేకానంద స్వామి చెప్పారు” ఒక లక్ష్యాన్ని ఎంచుకుని ఆ లక్ష్య సాధన కోసం శ్రమిస్టె కనీశం 14 సం.ల తరువాత ఆ లక్ష్యానికి మంత్ర శక్తి సంప్రాప్తిస్తుందని ” అలా ఒకే ద్యేయంతో,ఒకే లక్ష్యంతో 1994 నుండి శరమించాను. కేవలం బాబు మీది పగతో కాదు..అర్దాంతరంగా ముగిసిన ఎన్.టి.ఆర్ యుగానికి ఒక నిండుతనాన్ని సమకూర్చేందుకు పని చేసాను.”సమాజమే నా దేవాలయం పేద ప్రజలే నా దేవుళ్ళన్న “ఎన్.టి.ఆర్ సూక్తియే ప్రేరణగా ,నదుల అనుసందానమె ముఖ్యోద్దేశంగా “ఆపరేషన్ ఇండియా2000″పథకాన్ని రూపొందించాను. అప్పట్లో కేంద్ర స్థాయిలో చక్రం తిప్పిన బాబుకు నివేదించాను.ఒకటి రెండు సార్లు కాదు 1997 నవంబరునుండి ఎడ తెరగని లేఖాస్త్రాలతో ఉక్కిరి బిక్కిరి చేసాను, రిమైండర్లతో ముంచెత్తాను.

నా పథకం పై స్పందించకుంటే కుప్పం నుండి మీ పై పోటి చేస్తానని ఉత్తరాముఖంగా తెలిపిన పాపానికి తను పాలించిన 9 సం.లు ఓటరు లిస్టులో నా పేరు లేకుండా చేసారు. జిల్లా యంత్రాంగానికి మౌలిక ఆదేశాలిచ్చి నా పేరును బ్లాక్ లిస్టులో పెట్తి నేనే అర్జి పేట్తుకున్నా దాని పై ఏ అధికారి స్పందించకుండా చేసారు. కేవలం ఒక రేషన్ కార్డు కొరకు జిల్లా జడ్జిని ఆశ్రయించ వలసివ్ఛ్ఛీంది.
6 సంవత్సరాలుగా స్పందించని సి.ఎం.పేషి స్పందన కొరకు జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించవలసి వచ్చింది. ఇలా ఒకటి కాదు రెండు కాదు..ఎన్నో అవాంతరాలు,అవస్థలు. నా మీద పోలీస్ విచారణ జరిగింది.

ఇంత చేసి నా ప్లాన్ లోని ముఖ్యాంశాలను తనదైనట్టుగా ప్రకటించుకున్నాడు. కొన్ని అమలు కూడ చేసాడు. కాపిరైట్ యాక్ట్,ప్రకారం ఇది నేరమని తెలిసినా ఈ పని చేసాడు.

Read Full Post »

Older Posts »