Feeds:
టపాలు
వ్యాఖ్యలు

Posts Tagged ‘chiranjeevi’


చిరుగారు !

ఆర్కుట్ గురించి తెలియని వారుండరు. ఇందులో రక రకాలైన అభిరుచులు గల వారు గ్రూపులుగా ఏర్పది ఉంటారు. వీరికి సందేశమివ్వాలంటే ఆ గ్రూపులోకి ప్రవేశించక తప్పదు.

ఆడవి దొంగ నుండి అల్లుడా మజాకా సినిమా వరకు నేనుసైతం మీ అభిమానినే. అల్లుడా మజాకా సినిమాలోని బూతు డైలాగులు,అశ్లీల ద్రుశ్యాలతో విసిగి మీకు దూరమయ్యాను.

పాపం అభం శుభం తెలియని కుర్రాళ్ళు చిరు మాయలో కొట్టుకు పోయి బంగారు భవితను పోకొట్టుకుంటున్నారే అన్న భాధ తో మీ గురించి నాలుగు మాటలు మెసేజ్ పెట్టాను.

అందుకు రక రకాలైన భూతులను స్క్రాబ్ చేస్తున్నారు. చంపుతామని,తంతామని బెధిరంపులు వేరు.

ఈ నేపథ్యంలో మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా !

మీరు అరిచి గీ పెట్టే మార్పు ఇదేనా?
పి.సి.సి.ని తగుల పెడితే కాంగ్రెస్ వారు శాంతియుతంగా నిరశన వ్యక్తం చేస్తున్నారు.

మీ గురించి ఉన్న మాట చెప్పినందుకు మీ అభిమానులు భూతులు తిడుతూ చంపుతామంటున్నారు.

ప్రజలు ఇవన్ని గమనిస్తూనె ఉన్నారు.

అందరు పార్టి పెట్టాక ,పొరబాతున గెలిచాక అవినీతికి పాల్పడుతారు ..కాని మీ విషయానికొస్తే పార్టి పెట్టి పెట్టకనే వసూళ్ళు జరిగినట్లు గా అరోపణలొస్తున్నాయి.

మిగిలిన పార్టిల్లో ఏ 5 సం.లకో మాత్రమే వలసలు జరిగేవి. కాని మీ పార్టిలో చేరిన కొన్ని నెలలకే వలస వెళ్ళిపోతున్నారు.

ఎన్.టి.ఆర్ హరిక్రుష్ణను కేవలం చైతన్య రథసారథిగా మాత్రమే వాడారు.

మీ పార్టిలో ఏమో పవన్,నాగ బాబు,అల్లు అరవింద్ తప్ప ఇంకెవ్వరికి ఏ పవరూ ఉన్నట్టు కనిపించటం లేదు.

సినిమాల్లో ఉంటూ కోట్లాది రూపాయల నల్ల దనాన్ని పారితోషికంగా స్వీకరించిన మీరు ఇప్పుడు అవినీతి గురించి మాట్లాడటం హేయంగా లేదా?

పోని మీ స్వంత ప్రాపర్టిని పరిటాల వద్దనుండి కాపాదుకో లేక చంద్రబాబుతో పంచాయితీ పెట్టి విఫలమయ్యారని ఒక సమాచారముంది.

మీ ఆస్తినే కాపాదుకోలేని మీరు రాష్ట్రాన్ని ఎలా కాపాడుతారు?

అయ్య! మీ కుటుంబంలోని ఇద్దరు స్త్రీలకు న్యాయం చెయ్య లేని మీరు రాష్ట్రంలోని మహిళాలోకానికి న్యాయం చెయ్యగలరని ఎలా నమ్మ మంటారు?
మీరే చెప్పారు..ప్రతి విమర్శకు పాల్పడమని సేవతోనే సమాదానం ఇస్తామని. ప్రతి విమర్శకాదు కదా మీ ప్రసంగాల్లో ముప్పావు సమయం విమర్శలు,ఆధారాల్లేనివిమర్శలకే,ఆరోపణలకే సరి పెడుతున్నారు.

రోజా అమ్మా అంటే షోబా రాణి నీయమ్మా అనే స్థితిలో మీ పార్టి ఉంది. మీ అభిమానుల్లో,మీ మహిళారజ్యం నేతల్లోనే మార్పు తే లేని మీరు మార్పు తెస్తానంటే ఎలా నమ్మమంటారు.

పథకాల అమల్లో అవినీతి జరిగిందన్నా అది అతికినట్టుంటుంది. మీరేమో అవినీతి కోసమే పథకాలు అమలవుతున్నాయంటున్నారు.

వికలాంగుల పట్ల ఎంతో శ్రద్ద చూపిన మీ పార్టిలో మీరు అధికార ప్రథినిధిగా నియమించిన పరకాల ప్రభాకర్ వికలాంగుల మనోభావాలు దెబ్బ తినేలా మాట్లాడారు, ఈ విషయం పై మీ స్పందన ఏమిటో ఇందాకా వెలుబడ లేదు..
చెరో చేనల్,చెరో పేపరు పెట్టుకుని స్వంత డబ్బా కొట్టుకుంటూ,వై.ఎస్., జగన్,సాక్షి పత్రికల పై నిందాపనిందలను వేస్తున్నారు. మీరు రాజకీయ ప్రవేశం చెయ్యడానికి కొన్ని నెలలనుండి ఆంథ్ర జ్యోతి మీకు విపరీత ప్రచారం ఇచ్చింది. దీనికి గాను వారేం ఆసించారు? మీరు దేనిని తిరస్కరించారు? ఆ దేవునికే ఎరుక..

ఇప్పటికైనా సరే వసూలు చేసిన డబ్బులు ఆయా నేతలకు వెనక్కిచ్చి తప్పుకొండి. చూడటానికి వచ్చిన జనమంతా ఓట్లేస్తారని భ్రమిస్తే షెడ్ అయిపోతారు.

వై.ఎస్.అమలు చేసిన పథకాలతో ప్రతి కుటుంభంలో కనీశం ఒక్కరన్న లబ్ది పొందియున్నారు. మన ప్ర్జలకు జ్ఞాపక శక్తి ఎక్కువ. క్రుతజ్ఞతా భావం ఎక్కువ. మీరు రేపొచ్చి ఇస్తానంటున్న వాతికన్నా,చేస్తానన్న వాటికన్నా ఇది వరకే తాము పొందిన వాటినే గుర్తు పెట్టుకుంటారు.

(మీకో రహస్యం చెప్పనా ..మీరు ఎంత బాగా తిరిగితే వై.ఎస్.కు అంతగా లాభం చేకూర్చిన వారవుతారు. వ్యతిరేక ఓట్ల మీద ఆశతో తె.దే.పా బరిలో ఉంది. ఆ వ్యతిరేక ఓట్లను మీరు ఎంతగా చీచితే వై.ఎస్.,కాంగ్రెస్ పార్టీలకు అంతగా లాభం..కీప్ ఇట్ అప్)

గమనిక:

ఇదేమి కొత్త విషయాలు ఏవీ ప్రస్తావించలేదనుకోకండి. ఇవన్ని 2009 ఎన్నికలకు పూర్వం వ్రాసినవి. అప్పట్లో ఇండియన్ పిలిటికల్ క్లోసప్ అనె నా బ్లాగులో చిరు,వై.ఎస్. జాతకాలు అనలైజ్ చేసి వై.ఎస్. మళ్ళీ సి.ఎం అవుతారు ..మెజారిటి కాస్త తగ్గొచ్చంతే చిరుకు ఇరవై ముప్పై సీట్లు వ్వస్తే ఎక్కువ అని వ్రాసాను. ఈ విషయాన్ని చిరు ఫ్యేన్స్ (ఆర్కుట్ ) తెలుపగా వారి స్పందన – ఆ స్పందన పై నేను వ్రాసిన ఓపెన్ లెటర్ ఇది

Read Full Post »


చిరంజీవి నష్ఠ జాతకుడు. (ఇతరులకు) . అతను ఎప్పటికి చెడి పోడు. అతనితో చేరినవారెవ్వరూ భాగు పడరు. అతనిది తులా లగ్నం. లగ్నంలో శని పరమోచ్చ స్థానంలో ఉన్నాడు. అయినా పెనముకు భయపడి పొయ్యిలో దూకినట్టుగా జగన్ వర్గం ఎక్కడ సహాయ నిరాకరణ చేస్తుందోనని పి.ఆర్.పి.తో పొత్తుకు సాహసించింది కాంగ్రెస్ పార్టి. 2009 ఎన్నికల్లో చిరంజీవి ప్రధానంగా డా.వై.ఎస్. రాష్ఠ్ర దనాన్ని సోనియాకు దోచి పెట్టారని ఆరోపిస్తూ వచ్చారు. ఇప్పుడీ పొత్తు ఆ ఆరోపణ నిజమని అంగీకరించినట్టా.
చిరంజీవి రాజకీయ ప్రవేశం నాటినుండి లెక్క కడితే అతనితో తొలి ప్రెస్ మీట్లో పాల్గోవలసిన మితౄడు కాడ నుండి అసంఖ్యాక కార్యకర్తలదాక ఎందరో చచ్చారు.

దరిదౄడికి ఆకలెక్కువా అన్నట్టుగా ఎన్.టి.ఆర్ కన్నా ఎక్కువ సీట్లు సాధించి చూపుతానన్నారు చిరంజీవి గారు. కాని అన్నీ బెడిసి కొట్టాయి. టిక్కెట్స్ అమ్ముకున్నారు. కొనే స్థోమత గలవారికి ప్రజా మద్దత్తు లేక పోయే. ఇతర నియోజిక వర్గాల కథ ఎటో నేను బల్లె గుద్ది చెప్పలేను కాని గతంలో 3 సార్లు గెలిచి, ఒక సారి ఓడిన పాత చింతకాయ పచ్చడి సి.కె.బాబును సైతం ఆ పార్టి అభ్యర్ధి గెలవలేక పోయారు.
ఇంతకీ లక్షలు లక్షలు పోసి వార్తల్లాంటి యాడ్స్ లెక్కలేనన్ని పబ్లిష్ చెయ్యించుకున్నారు. 40 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. అయినా ఒరిగిందేమి లేదు.

ఓల్డ్ ఈస్ గోల్డ్ అన్నట్టుగా సి.కె.బాబునే ప్రజలు గెలిపించారు. కనీసం అందుబాట్లో ఉంటారని. ఇదిలా ఉంటే వై.ఎస్. పథకాలతో, సాక్షి దినపత్రిక భలంతో, సాక్షి టి.వి. ప్రచారంతో గెలిచిన కాంగ్రెస్ పార్టి వై.ఎస్. మరణానంతరం బుద్దిగా జగన్ బాబును ముఖ్యమంత్రి చేసి ఉంటే ఈ అడుక్కునే స్థితి వచుండదు. ఎంతటి అన్యాయానికి ఒడిగట్టినా, వై.ఎస్. మరణాన్ని, వై.ఎస్. మరణానంతర ప్రాణ త్యాగాలను కించ పరచినా జగన్ బాబు శిలువ మీద జీసస్ లా మౌనంగా భరిస్తూనే వచ్చారు.

కాని తాము చేసిన అన్యాయం గురించి ఎరింగిన కాంగ్రెస్ పెద్దలు ఇలా శతౄవు మోచేతి నీళ్ళు తాగడానికి సైతం ఒడికట్టేరు. రేపు జగన్ తిరుగు భాటు చేసినా చిరంజీవి భిక్షంతో (ప్ర.రా.పా ఎం.ఎల్.ఏలతో) గట్టేక్కవచ్చని కకౄత్తి పడినట్టున్నారు. ప్ర.రా.పా. చుక్కాని లేని పడవ. అందుకే అక్కడ అంత గొడవ. చిరంజీవి జై కాంగ్రెస్ అన్నా ఇంత కాలం తిట్టి పోసి ఈ రోజు చేతి గుర్తుకు ఓట్లెలా అడుగుతామని కార్యకర్తలే కాదు , ద్వితీయ స్థాయి నాయకులు సైతం రాం రాం అంటారు. రెంటికి చెడ్డ చందాన కాంగ్రెస్ పార్టి నష్ఠ పోవడం ఖాయం.

Read Full Post »