Feeds:
టపాలు
వ్యాఖ్యలు

Posts Tagged ‘AP’


గతంలో నేను మహిళలకు మాత్రమే శీర్షికన ఒక టపా వ్రాసాను. సతరు టపా చదవనివారు క్రింది లింకును క్లిక్ చెయ్యండి.

http://srungaram.ning.com/profiles/blog/show?id=2639583%3ABlogPost%3A195369&page=1&xg_source=msg_com_blogpost

దాని పై శ్రుంగారం డాట్ కాంలో వచ్చిన కమెంట్ :
Surya:
SIR SUPER GA CHEYPARU KANI ,NOW PRESENT LADIES FAST GA VUNARU VUNDATOM THPAPU LEDU KI , CHALA MANDHI LADIES MALES VALA LOO PADI MOSAPOTHUNARU

ఇదుకు సమాదానంగానే ఈ టపా వ్రాసాను
సూర్య గారు,
పుట్టడమే తల్లిగా పుదుతుంది ఆడపిల్ల. ఆరు సం.ల వయస్సుగల పాప అన్నం వడ్డిస్తుంది. కాని 50 సం.ల వయస్సున్న మగవాడు సైతం చిల్లరగా ప్రవర్తిస్తుంటాడు. ఆడపిల్ల కేవలం ఆడపిల్లే అయితే ఆమె ఎలా ఉన్నా సమస్య లేదు. కాని ఒక విదంగా ప్రకౄతి సిద్దంగానే స్త్రీ వికలాంగురాలు. శారీరక దౌర్భల్యాన్ని అధిగమించవచ్చు గాని దాంతో సంక్రమించిన మానసిక దౌర్భల్యాన్ని ఓవర్ కం కావడం ఎంతో కష్ఠం. అందుకే నేను మొత్తుకుంటున్నాను. మొదట మీ శారీరక దౌర్భల్యాన్ని పారాద్రోలండి. సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడి. మీరెంత అందంగా ఉంటారు, ఎంత మందిని ఆకర్షిస్తారన్నది ప్రకౄతికో, భవిష్యత్తుకో అవసరం లేదు.
నేను 1987లో జిల్లా ఖజాణాకార్యాలయంలో సెక్షన్ రైటరుగా పనిచేసాను అక్కడ గ్రేస్ సరోజిని అని ఒకావిడ. బక్క చిక్కిన శరీరం, పొంతనలేని పొట్ట, కొత్తమిరి కట్టకన్నా ప్రేలవంగా జుట్టు, గుళ్ళ గూబ కళ్ళు. అయితే మనం (నేను) ఆత్మనే చూద్దాం కాబట్టి ఆమెతో కూడ క్యేషువల్ గానే ఉన్నాను. దీంతో ఆమె దగ్గరై తన ఫ్యేమిలి ఆల్బం చూపింది. అందులో ఆమె చిన్ననాటి ఫోటో చూసి బిత్తర పోయాను . ఆ రూపం ముందు భానుప్రియా డమ్మి అవుతుందంటే నమ్మండి.
ఆమె ఒక డైవోర్సీ, విడాకులకు ఆమె కురూపానికి సంబంధం లేదు. ఇతర కారణాలవలనే విడాకులైంది. ఇంతకీ ఆమెకేమైందంటే కాలేజి రోజుల్లో టైఫాయిడ్ వచ్చిందట. అందం సంగతి ఇది. ఇదివరకే నేను చెప్పినట్టు స్త్రీ భవిష్యత్తులో ఎదుర్కొనవలసిన సవాళ్ళు అనేకం ఉ. పీరియడ్స్, డెలివరి, ఆ సమయంలో సక్రమంగా తినలేక పోవడం , ఇప్పట్లో ఆ సవాలు డబుల్ అయ్యింది. స్త్రీ స్వాతంత్రయం పేరిట ఉధ్యోగాలు కూడ చేసి పెట్టాలిగా. అప్పట్లో కొన్ని పనులు ఆమెకు తప్పేది. ప్రస్తుతం టూ వీలర్ నడుపుతుంది కాబట్టి అవీ ఆమె నెత్తినపడ్డాయిఫాస్ట్ నెస్స్ అన్నది గమ్యాన్ని చేరుకోవడంలో వస్తే ఫర్వ్చాలేదు గాని నిరర్థక, భవిష్యత్తుకు వినాశకరంగా తయారయ్యే కార్య కలాపాలవలన నష్ఠ పోయేది స్త్రీయే. కాలం మారిందని ఎంతగా రొమ్ము బాదుకున్నా పురుషుడు మాత్రం ఆఠవిక యుగంలోనే ఉన్నాడు. తనతో పాటు పది మందితో తిరిగే ఆడ పిల్లను పెళ్ళి చేసుకోడు. కేవలం తనతో మాత్రం తిరిగుంటే అది వేరే సంగతి. కాబట్టి ఈ ఫాస్ట్నెస్స్ వలన లూజర్ స్త్రీయే.
అప్పట్లో సమాజం స్త్రీని అనచి వేతతో దోచుకుంటే ఇప్పుడు స్వాతంత్ర్యం పేరిట దోచుకుంటూంది. నేను మహిళలను కోరేది ఒక్కటే మీర్ ఫస్టఫాల్ మనుష్యులు. ఆ తరువాతే లింగ బేదం. మీరు మీ ప్రియునికో, మీ భర్తకో ఆ గంటో /పావు గంటో స్త్రీగా ఉంటే సరిపోయేది గా. 24 గంటలు వేష ధారణ, హావ భావాలు, సిగ్గు పడటాలు, బుగ్గలు ఎర్ర బడటాలు ఎందుకనే.
ఇవి మిమ్మల్ని ఎదుటివారి ముందు నిలబెడతాయని మీరు భ్రమిస్తున్నారు. కాని వీటి వలన మీరు పండుకోవలసి వస్తుందేమో కాని నిలబడటం కల్ల ఇక్కడ కలిసి తిరగడంలో ఉన్న చిక్కేమంటే ఇందులో నష్ఠ పోయేది కేవలం స్త్రీయే. గర్భ ధారణ, ఎయిడ్స్, సుఖ రోగాల సమస్య లేనప్పటికి ( కేండోంస్ ఉన్నాయి కాబట్టి) అపఖ్యాతి పాలు కావడం మాత్రం తధ్యమే. లో క్లాసు, హై క్లాసు కథ ఎటో ఉన్నా మిడ్డిల్ క్లాస్ స్త్రీలకు మాత్రం ఇది గొడ్డలి పోటే కాబట్టి తస్మాన్ జాగ్రత్త ..

మనుష్యులుగా ఉండండి. మనుష్యులుగా ప్రవర్తించండి. మనుష్యులుగానే సాధించవచ్చు. మీరు స్త్రీ అన్న సంగతి కేవలం మీ జీవిత భాగస్వామికి రుజువైతే చాలు సుమా !

Read Full Post »


అమ్మా తల్లి నా వయస్సు 42 సం.లు. నా అనుభవాలకు వయస్సు కడితే ఇది రెట్టింతలవుతుంది. ఈ టపాతో మళ్ళీ నా బ్లాగు బ్యాన్ అయినా సరే డోంట్ కేర్. నేను చెప్ప దలచింది చెప్పేస్తా. ఇది పురుషాహంకార ప్రపంచం . మేము ఎవరికి తక్కువ కాదు. పొడుస్తామంటారు. మరి ఫారం కోడిలాగా ఎప్పుడూ మీ ఎత్తు,పొడవు, బ్రా సీజు, భరువు ,నడుము సైజుల మీదే ఎందుకు దౄష్ఠి సారిస్తారు. ఇది పురుషుల భావానికి ఆమోద ముద్ర వేసినట్టేగా ఉంది. మీకు వినడానికి అసహ్యంగా ఉన్నా కొన్ని నగ్న సత్యాలు చెబుతా. మీరు నోతికలా రంగేసుకోవడం ఎందుకో తెలుసా ? మీ యోణి పెదాలు ఎలా ఉంటాయో సింబాలిక్ గా చూపించడానికే. అవును. యోణి, నోరు ఒకే ట్యూబుకు టాప్ అండ్ బాటం. ఇది చదివినాకన్నా అలాంటి రంగులు మానెయ్యండి. ఇక మీ బ్రా సైజు. మీకా అంగాన్ని దేవుడు ఇచ్చింది రేపు మీకు కలుగ పోయే పిల్లడికి పాలుపట్టడానికి మాత్రమే. దాంతో ఇంకేమన్నా చేసుకుంటే అది అడ్డిష్నల్ యూసేజ్ మాత్రమే.
ఇక భరువు. మీలో చాలా మంది భరువు తగ్గాలని ఉవ్విళ్ళురుతుంటారు.జన్మతహ ఆడ శిశువు కొంత వెయిట్ ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటుంది, వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుంది. నొప్పి భరిస్తుంది, భాగానే ఆకలవుతుంది. మరింత తర్కంతో ఆలోచించ కలుగుతుంది. ఎందుకో తెలుసా ?

భవిషయత్తులో ఆవిడ మెచ్యూర్ అయ్యాక నెలసరి రక్త నష్ఠం జరుగుతుంది కాబట్టి. భవిష్యత్తులో ఆమె గర్భవతి అయితే కొన్ని నెలల దాకా సరిగ్గా ఆకలి కాదు కాబట్టి, సరిగ్గా భోంచెయ్య లేదు కాబట్టి. ముందుగా ప్రకౄతి ఈ ఏర్పాటు చేసింది. భరువెక్కడానికి ఎన్నో కారణాలున్నాయి. భరువు తగ్గడానికి ఎన్నో సన్మార్గాలున్నాయి. అవును మీరు భరువెక్కుతున్నారంటే వ్యాయామం లేమి, ఐస్ క్రీంస్, ఎక్కువ సమయం టి.విల ముందు, కంప్యూటర్ల ముందు గడపడం ,టిన్ ఫుడ్, జంక్ ఫుడ్ , అర్ద రాత్రిదాకా మేల్కొని ఉదయం 8 గంటల దాక నిద్ర పోవడం ఇలా ఎన్నో కారణాలున్నాయి. భరువు తగ్గడానికి పస్తులుండటం, అనుమానస్పద మాత్రలు వాడటం ఒకటే మార్గం కాదు. సమస్యకు గల కారణాలను నివారిస్తే సమస్య తనంతట తనే పరిష్కారమవుతుంది.
ఇలా పై పై తళుకులకు ప్రాధన్యత ఇస్తూ అసలైన విషయాలను గాలికొదిలేస్తే రక్త లేమికారణంగా భహిష్ఠు సైతం సక్రమంగా కాక అది యూట్రస్ క్యేన్సరు దాక పోతుంది. భవిష్యత్తులో సంతాన విషయంలోను ఇది ఇబ్బంది కల్గించవచ్చు.

మోడర్న్ పేరిట అబ్బాయలతో తిరుగడం, నెట్ క్యేఫ్ లలో శ్రుంగారాలు చెయ్యడం తప్పనిపించే వయస్సు కాదిది. రేపు కడుపొస్తే ? పది మందికి తెలిసి నవ్వుల పాలైతే.. భగా ఆలోచించండి. చదువుకోవడానికి లిప్స్టిక్స్, జీన్, షార్ట్స్ అవసరం లేదని నా ఉద్దేశం.ఇవి దరించిన వారంతా చెడి పోతారని చెప్పను. కాని చెడిపోయే అవకాశానికి తొలి మెట్టిదే. మీ డ్రెస్ మీ ఆలోచనా విదానాన్నే మార్చెయ్య గలదు టేక్ కేర్

Read Full Post »


అవును. నేనిదివరకే చెప్పినట్టు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టిని గెలిపించింది సాక్షి పత్రిక & సాక్షి టివియే.అంటే జగన్ బాబే. అటువంటిది జగన్ ఎప్పటికైనా నేనే సి.ఎం అనడం కొంత చేతగాని మాటగా కనిపిస్తూంది. అవును . నేను వై.ఎస్.ఆర్ అభిమానినే. అయితే తొలూత నుండి జగన్ వ్యవహార శైలి నాకు మింగుడు పడటం లేదు. ఒక విదంగా జగన్ రజిని కాంత్ ను తలపిస్తున్నాడు. ఆయనా అంతే తన సినిమా రిలీజ్ అయ్యే సమయానికి ఏదో ఒక టి చెప్పి సంచలనం సౄష్ఠించటం ఆ పై మౌనం వహించటం చేస్తూ ఉంటాడు.

వై.ఎస్. మరణానంతరం జగన్ సి.ఎం. కావాలని రాష్ఠ్రం ముక్త కంఠంతో అంటే , జగన్ సేన, యూత్ కాంగ్రెస్ వారు పెద్ద యెత్తున ఆందోళనలు చేపట్టారు.దీనిని పార్టిలోని కొన్ని ముసలి నక్కలు ఆదిష్ఠానానికి వేరే విదంగా కమ్యూనికేట్ చేసాయి. పోనీ.. వారు చెయ్యాల్సిందే చేసారు. ఆదిష్ఠానానికి జగన్ బాబుకు మద్య అఘాదం ఏర్పడింది. వై.ఎస్.ఆర్ సంతాప సభలో సోనియా పేరెత్తకుండానే జగన్ ప్రసంగించారు. రాజకీయ చదరంగంలో ఇది గొప్ప చెక్. (పైగా తొలూత నుండి టి.వి.కెమరాలకు ఓ జెండా అగుపడుతూనే ఉండే ..అది త్రివర్ణ పతాకము . మద్యలో వై.ఎస్.ఆర్ రూపం ఉండే. వెరి గుడ్ అనుకున్నాను.

కాని డిల్లీనుండి పిలుపందగానే నా భవిష్యత్ సోనియా చేతుల్లో పెట్టానని జగన్ వెను తగారు. ఇదీ ఓకే. వెంబటే ఒక జలక్ ఇచ్చారు. వై.ఎస్. పథకాల అమలుకు ప్రభుత్వం పై వత్తిడి తెస్తా అన్నారు. వెరి వెరి గుడ్.

సోనియాతో తొలి విడత చర్చలంతరం నేను స్వతంత్రించి ఏమి చెప్పలేను . నాన్న గారి సహచరులు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఉన్నారు .వారితో చర్చించి వారిని ఒప్పించి వస్తానని ఫిట్టింగ్ పెట్టుంటే అది రాజకీయం. పోని ఎలానో వ్ధేయత ప్రకతించారు. అదీ గతం గతమే.

కొండా సురేఖ రాజినామా చేసారు. అనంతరం సోనియా వద్దకు జగన్ వెళ్ళి కలిసారు. అప్పుడైనా సురేఖను మళ్ళీ మంత్రి మండలికి తీసుకోవాలని పట్టు పట్టి ఉండాల్సింది.
నేనైతే త్యాగం చేస్తాను. కాని నమ్మిన వారిని ఆదుకోవడం నాన్నగారి సిద్దంతం అందుకు నేను కట్టుబడి ఉంటానని పట్టు పట్టి ఉండాలి.

ఆ పనీ చెయ్యలేదు. కడప టిక్కెట్ విషయంలోనైనా పట్టు పట్టి ఉండాలి. అదీ చెయ్యలేదు.

నేనైతే సెప్టంబరు 14 న ఆయనకో ఉత్తరం పంపాను (కొరియర్ ద్వారా). మీ మద్దత్తు దారులను గవర్నరు వద్దకు తీసుకెళ్ళండి. మెజారిటి సభ్యుల మద్దత్తు లభించకున్నా బాధ లేదు. మేము కాంగ్రెస్ వై.ఎస్.ఆర్ పేరిట వేరే గ్రూపుగా పని చేస్తాం. ప్రస్తుత ప్రభుత్వానికి భయిటనుండి మద్దత్తిస్తామని ప్రకటించండి . కనీశం రీమోట్ అన్నా చేతికొస్తుంది. రానున్న 18 న నిండు అమావాశ్య కావున పంచాంగం పాడూ చూసుకోవలసిన అవసరం కూడ లేదని స్పష్ఠంగా పేర్కొన్నాను.

దీని ప్రతిని ఎం.పీలందరికి మెయిల్ చేసాను. జగన్ సంభంధ వెబ్సైట్స్ కీ పంపాను. కాని ఏం లాభం?

రాజకీయంలో ఎప్పటికైనా అనే మాట చేతగాని మాట. ఎంత పెద్ద లస్ఖ్యానికన్నా తక్కువ డెడ్ లైన్ సూచించాలి. అయితే ఆ డెడ్ లైన్ని నాయకుడు నమ్మరాదు. వాస్తవం తెలిసి ఉండాలి. ( కే.సి.ఆర్ చేసిన పొరభాటు ఇదే. కార్యకర్తలను నమ్మించాల్సింది పోయి తనే నమ్మడం మొదలు పెట్టి పప్పులో కాలేసాడు

కాంగ్రెస్ పార్టి చరిత్ర చూస్తే జగన్ బాబుకు పూర్తిగా అర్థం అవుతుంది .వారి తంతే అందితే జుట్టు, అందకుంటే కాలు చందాన ఉంటుంది. ఇక్కడి మాజి సి.ఎం.కుమారుల పరిస్థితి చూసన్నా జగన్ మేల్కోవాలి.

ఇప్పటికీ మించి పోయిందేమి లేదు ఏదో ఒక డిమాండు రోశయ్యకు పెట్టాలి. డెడ్ లైన్ పెట్టాలి.
( ఉ, సురేఖ విషయ్మే అయినా మంచిదే ) లేకుంటే మేము వేరే గ్రూపుగా చీలి పోతాం. అప్పటికి సోనియానే మా నాయకురాలు. వై.ఎస్. పథకాలకు, వై.ఎస్. వర్గీయులకు హాని జరక్క చూడటమే మా ద్యేయం అని ప్రకటించ వచ్చు.

జగన్ బాబు ఒక్క సారి వేంక్కి తిరిగి చూడండి. వై.ఎస్. పార్థివ దేహం ఉండగా ఎం.ఎల్.ఏల ప్రవర్తన ఎలా ఉండే ? నెలకు ఎలా మారే ? రెండు నేలకు ఎలా మారే ? ఇప్పుడు ఎలా మారే ? ఆలోచించండి. ఇప్పటికే చాలా ఆలశ్యం చేసాం. మీరు సి.ఎం. ఇప్పుడే కాకుంటే పోయే. కాని ఎప్పుడు సె.ఎం.కావాలన్న సంగతి కనీశం మనకన్నా తెలిసి ఉండాలి.

నేను చెప్పిన పని చేస్తే ఎన్నికలు ఎప్పుడు రావాలో ? ఎవరు సి.ఎం.కావాలో నిర్ణయించే పొజిసహ్న్ మీకొస్తుంది.

డా. వై.ఎస్.ఆర్ రహే !

Read Full Post »

డా|| వై.ఎస్.అమర్ రహే !


మానవుడు అడవులను వదిలి ,సంచార జీవితం గడిపి ,ఆ పై స్థిరవాసం గైకొన్నాడు. అక్కడికి పరిపాలన వ్యవస్థ యొక్క అవసరం వచ్చింది. నాటికి నేటికి ఎన్నో పరిపాలనా వ్యవస్థలు వచ్చాయి. ఆధునిక మానవుడు ప్రజాస్వామ్యాన్ని అత్యుత్తమ పరిపాలనా వ్యవస్థగా గుర్తించాడు. రాజరికం , అరిస్టోక్రసి (మేధావుల గ్రూపు పరిపాలిస్తూంది) నియంత్రుత్వం ,సైన్యాధికారం ఇలా ఎన్నో వ్యవస్థలు చరిత్ర పుటల్లో కనిపిస్తాయి.

అది ఏ వ్యవస్థ అయినప్పటికి పాలకుడు/పాలకులు సామాన్యుల గోడు పట్టించుకుని ప్రతి పౌరునికి ప్రాణ రక్షణ, కూడు గుడ్డ, గూడులను అందించాలి. ప్రజలు స్స్వావలంభణతో గౌరవ ప్రదమైన జీవనం గడిపేలా వ్యవసాయ,పరిశ్రమ రంగాలను , సదరు రంగాలకు అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చాలి. అప్పుడే సమగ్రాభివృద్ది సాధ్యం. ఇవన్ని సాధ్యం చేసిన పాలకుడు రాజైనా, భంటైనా ( భంటులు కూడ పరిపాలించినారు .ఒట్టు !) కమేండరైనా, మేధావి అయినా, నియంత అయినా ,ప్రజాస్వామ్య బద్దంగా ఎంపికైన నేత అయినా సరే చరిత్రలో వారి పేరు స్వర్ణాక్షరాలతో లిఖింప పడుతుంది.

అలా రాష్ఠ్రాభివృద్దికి ,రాష్ఠ్ర ప్రజల అభ్యున్నతికి పాటు పడిన నేత డా.వై.ఎస్.ఆర్. అందుకే ఆయన పేరు రాష్ఠ్ర రాజకీయ చరిత్రలోనేకాక ,దేశ ,ప్రపంచ రాజకీయ చరిత్రలోకెక్కింది. సుస్థిర స్థానం సంపాదించుకుంది. సరే ! వై.ఎస్. అమరులయ్యాక ఆయనగారి జీవిత చరిత్రను రచించడం ఏల ? ముద్రించడం ఏల ? దీంతో సమాజానికి ఏం లాభం అని కొందరు ప్రశ్నించవచ్చు.

ఈ బూమి పైకి వచ్చినప్పుడు మానవుడు ఎంతో పవిత్రతతో, స్వార్థం, కల్లా కపటాలకు ఏ మాత్రం తావు లేని వాడుగా ఉంటాడు. అతనలా పెరుగుతుంటే సమాజంలోని కుళ్ళు,కుతంత్రం ,స్వార్థం వంటివి అతనిలోకి ప్రవేశిస్తూనే ఉంటాయి. కాని యవ్వనంలో తనలో ఉరకలేసే శక్తి కారణంగా ఏ మాత్రం అభద్రతా భావానికి గురికాక, సమాజంలో తాను చూసే కుళ్ళు,కుతంత్రం ,స్వార్థాలను ఎండ కదుతుంటాడు. వ్యతిరేకిస్తాడు. పోరాడుతాడు. కాని యవ్వనం కరిగి పోతుంటే ,శక్తి తరిగి పోతుంటే తాను వ్యతిరేకించి పోరాడిన కుళ్ళు,కుతంత్రం ,స్వార్థాలకు లొంగి పోతాడు. (కొందరు యవ్వనంలోనే వీటికి లొంగి పోవచ్చు వీరు శ్రీ శ్రీ పేర్కొన్న పుట్టుకతో వృద్దులు )

ఈ సమయంలో యువత ఇదివరకే కుళ్ళు,కుతంత్రం ,స్వార్థం వీడి తనవారికి కోసంసర్వస్వము అర్పించే వాడే అసలైన కథానాయకుడు అన్న నిర్వచనానికి ప్రాణం పోసి,ప్రజా సేవకే అంకితమై ,కారణ జనుములుగా, చారిత్రిక పురుషులుగా చరిత్రలో నిలిచి పోయిన మహానుభావుల చరిత్రలను అద్యయనం చెయ్యాలి. వారిలో ఏ ఒకరినైన తమ ఆదర్శ పురుషులుగా వరించుకుంటే వారి మనోభలం ఇరుముడిస్తుంది. దీంతో యువత మాతృ భూమి, మాతృ భాషల ,పేద బడుగు వర్గాల ,పరిరక్షణకు నడుంకట్టే వీలు దొరుకుతుంది. “మనుషులు రుషులై ఎదగాలంటే పుణ్య చరితలే ఆధారం.”

“మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ.
పట్టుదలే ఉంటే కాగలడు మరో భ్రహ్మ ”

అటువంటి పట్ట్దుదలను ఇవ్వగల పుణ్య చరత్ర డా.వై.ఎస్.గారిది. కేవలం బాంబులకే ప్రఖ్యాతి గాంచిందన్న అపఖ్యాతికి గురైన మాతృభూమిని యావత్ ప్రపంచమే కీర్తించే విదంగా చేసిన డా.వై.ఎస్. జీవిత చరిత్ర యువతకు ఆదర్శంగా , స్ఫూర్తి దాయికంగా ఉంటుంది అన్న ప్రగాడ విశ్వాసంతో ఈ చిన్ని గ్రంథాన్ని చిత్తూరు పట్టణ వ్యాపరస్తులు, కాంగ్రెస్ పార్టి ప్రముఖులు, రాజకీయ క్రికేట్లో ఫోర్ కొట్టిన బహదూర్ శ్రీ. సి.కె.బాబు గారి అభిమానుల సహకారంతో ఇండియన్ పొలిటికల్ క్లోసప్ తెలుగు పక్ష పత్రిక విడుదల చేస్తుంది. ప్రతి యువత వై.ఎస్.జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని, వై.ఎస్. పెంపకంలో ఆయన నేర్పి , నూరి పోసిన నిస్వార్థం, కర్తవ్య నిర్వహణ, త్యాగం, విశ్వసనీయత, మానవీయత ,ప్రజా సేవలతో వై.ఎస్.ప్రతిరూపంగా మన మద్య ఉన్న వై.ఎస్. తనయుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని భలపరచాలని కోరుతున్నాను.

ఇట్లు
చిత్తూరు.ఎస్.మురుగేషన్ ,
ఎడిటర్,

Read Full Post »