Feeds:
టపాలు
వ్యాఖ్యలు

Posts Tagged ‘Jagan’


డా. వై.ఎస్ మరణానంతరం ఆ బాధ తట్టుకోలేక మరణించిన కుటుంభాలను ఓదార్చటానికంటూ జగన్ చే పట్టిన  ఓదార్పు యాత్రలో జీర్ణించుకోలేని అంశాలు కొన్ని ఉన్నాయి. మొదటిది ఇంత ఆలశ్యంగా ప్రారంభించటం. వై.ఎస్. మరణించి వారం పది రోజుల్లో తమ కుటుంభ పెద్దను / ముఖ్యులను పోగొట్టుకున్న కుటుంభాలను ఓదార్చటానికి  ఆరు నెలలనంతరం వెళ్ళటమే.

ఏ పనికన్నా ఒక కాల పరిమితంటూ ఉంది. కాని జగన్ ఈ విషయంలో మరో ఆలశ్యం చేసాడు.

సరే అయినదేమో అయినది. కనీశం కార్యక్రమ రూపకల్పణలోనన్నా కాసింత జాగ్రత్తలు తీసుకుని ఉండవలసింది.ఎన్నికల ప్రచారంలా ఆ డప్పులు, కాన్వాయి, అసహ్యంగా ఉన్నాయి

పోని ఇతనేమన్నా పది ఇరవై లక్షలు ఆ కుటుంభానికి సాయం చేస్తున్నాడా అంటే అదీ లేదు. జగన్ సాయం ఒక్క లక్షే

ఇది కాల్ రూపాయి కోతి ముక్కాలు రూపాయి బెల్లం తిన్నట్టుంది.  ఇతను చేయనున్న సాయమేమో లక్ష రూపాయలే. కాని కార్యక్రమ నిర్వహణకు ఖర్చు వంద రెట్లు

జిల్లాకో కార్యక్రమం అదీ విమానాశ్రయం దగ్గర్లోనే  ఇండోర్ లో ఏర్పాటు చేసుకుని హృదయానికి హత్తుకునే విదంగా నిర్వహించి ఉండ వచ్చు. చేసే సాయం ఏదో నిజంగానే సతరు కుటుంభాన్ని నిల బెట్టే విదంగా ఉండి ఉంటే మంచిది.

ఇవన్ని ఒక ఎత్తైతే ఈ కార్యక్రమం గురించి సాక్షి మరియు ఇతర (కొన్ని) చేనల్స్ లో చేసే ప్రచారాల హడావుడు చాలా విడ్డూరంగా ఉన్నాయి.

జగన్ మనస్తత్వం ఎవరికీ అర్థం కానిదై ఉంది. వై.ఎస్. చని పోయినప్పుడే సంతకాల సేఖరన  చేపట్టిన జగన్ మరెందుకో మెత్త బడి పోయారు. అలా చెయ్యడం సాంఘికంగా తప్పేమో గాని రాజకీయంగా తెలివైన చర్యే.  ఆ తరువాత ఇడుపులపాయలో పెద్ద భహిరంగ ఏర్పాటు చేసారు. సోనియా పేరన్నా ఎత్తకనే ప్రసంగం పూర్తైంది. పైగా కెమరాలకు ప్రధానంగా  త్రివర్ణ పతాకం మద్యలో వై.ఎస్. బొమ్మ ఉన్న జెండా కవర్ అయ్యేలా చేసారు. ఇదీ తెలివైన ఎత్తే. పార్లెమెంటులో గోల్డెన్ తెలంగాణా నినాదం కూడ క్శమార్హమే .

కాని రిలయన్స్ ఉదంతం, క్యేన్సర్ వ్యేక్సిన్, ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు  విద్యుత్తును భయిట  విక్రయించుకునే  వెసలు బాటు కల్పించటాన్నివ్యతిరేకించి నాలుక కరచుకోవడం జగన్ పై నా బోటివారికి ఉన్న విశ్వాసాన్ని  చాలా తీవ్రంగా దెబ్బ తీసాయి.

ఎలాగూ రోశయ్యతో కాని, రాహుల్ తో గాని, సోనియాతో గాని, పార్టిలోని సీనియర్ల తో గాని పొత్తు పొసగ లేదు. రానున్నవి స్థానిక ఎన్నికలే. వీటిలో పార్టికన్నా అభ్యర్దికే ప్రాధన్యత ఉంటుంది. జగన్ కాంగ్రెస్ వై.ఎస్. పార్టి స్థాపించడానికి ఇదే అనువైన కాలం.  ఇలా తన ఉనికిని చాటుకుంటే కొత్త పార్టి తదుపరి ఎన్నికల్లోపు భలపడవచ్చు, సోనియా మనస్సు మార వచ్చు.

ఈ ఓదార్పు యాత్రలు, ఈ హడావుడీలు ఎన్ని రోజులు గుర్తుంటాయి. జగన్ ఆలోచించాలి.

Read Full Post »



అవును. అటు సోనియ,ఇటు రాష్ఠ్ర నాయకత్వం జగన్ కున్న ప్రజా బలాన్ని గుర్తించ లేదు. పైగా జగన్ గారిని ఎలాగన్నా తొక్కి పెట్టాలనే చూస్తున్నారు. ఇది ఈ ఏడు నెలల్లో భాగా రుడీ అయిపోయింది .ఈ పరిస్థితిలో ఓదార్పు యాత్ర ,రాజ్కీయం మాట్లాడనువంటి ముసుగులో గుద్దులాటలు జగన్ కు అనవసరం.

తెగించి కొత్త పార్టి ప్రకటించాలి. రానున్నవి స్థానిక ఎన్నికలే. వీటిలో పార్టికన్నా అభ్యర్దులను చూసే జనం ఓటేస్తారు. ఈ యాత్రలు పాడు పరదేశాలకు ఖర్చు పెట్టుకోవడానికంటే సూటిగా కొత్త పార్టి పతాకం క్రింద స్థానిక ఎన్నికల్లో విజయ ఢంకా మృఓగిస్తే అటు దిల్లి, ఇటు రాష్ఠ్రంలోని గల్లీలు కదులుతాయి.

జగన్ ఆలోచించండి !

Read Full Post »


Sonia కాదు వారి అత్తమ్మ ఇందిరైనా సరే ఈ హఠాంపరిణామాన్ని ఊహించి ఉండరు. దిల్లీలో కూర్చుని, వి.హెచ్ వంటి పూజారుల పూజలు అందుకుంటూ తామే నిర్ణయం తీసుకున్నా పడుంటారని భావించిన సోనియాకు 56 మంది కాంగ్రెస్ ఎం.ఎల్.ఏ ల రాజినామా దిమ్మ తిరిగేలా చేసింది.

ఆరునెలలకో సి.ఎం ను మార్చి చేతులు కాల్చుకుని కాస్త బుద్ది తెచ్చుకున్న దిల్లీ నాయకత్వం వై.ఎస్. మరణానంతరం మళ్ళీ పాత మాట మొదలు పెట్టింది. నేను గత శాసన సభ ఎన్నికల సందర్భాంగానే నా బ్లాగులో స్పష్ఠంగా చెప్పాను. కే.సి.ఆర్ భూతం కాడని, బాటిల్లో భూతమని. టి.ఆర్.ఎస్. ఆవిర్భావం నాటినుండి ఎలక్షన్ టు ఎలక్షన్ తన ఉనికిని పోగొట్టుకుంటూ వచ్చిన తి.ఆర్.ఎస్ లో కే.సి.ఆర్ అతని కుటుంభ సభ్యులు తప్ప మరెవ్వరూ లేని స్థితి వచ్చింది

మార్కెట్ పోగొట్టుకున్న హీరో ఏ.ఆర్ రహ్మాన్ కాల్షీట్ పట్టుకున్నట్టుగా కే.సి.ఆర్ దీక్ష చేపట్టాడు. నాల్రోజులు చెయ్యించి ఉంటే ఆయనగారికి ఆయనే నిమ్మరసం తాగి ఇంటికెళ్ళి క్వార్టర్ కొట్టి పనుకొనే వాడు. వై.ఎస్. ఉన్నంత కాలం చెప్పు క్రింద తేలులా ఉన్న కే.సి.ఆర్ రోశయ్య వాలకం చూసి తోక విప్పాడు నిప్పు పెట్టాడు. కాగితంలోని పులి బొమ్మ చూసి జడుచుకున్నట్టుగా సోన్మియా చిదంబరం చేత ప్రకటన చెయ్యించారు. ఆ ప్రకటన వెలుబడకున్నా కే.సి.ఆర్ దీక్ష విరమించే వాడే.

ఆ దిశగా నింస్ హాస్పిటల్ లో టి.ఆర్.ఎస్ పార్టి పొలిట్ బ్యూరో సమావేశం కూడ ఏర్పాటైంది. అసలు కాంగ్రెస్ పార్టి చరిత్ర తెలిసిన ఎవరికైనా తెలుసు అది ఉత్త ఉసిరికాయల బస్తా. ఆ బస్తా ముడి గట్టిదైతే గాని ఏ కాయ బస్తాలో ఉండదు. కాంగ్రెస్ అదిష్ఠానం తీరే ఇంత. అవసరానికి మించి నాంచడం. లేదా తొందర పాటు నిర్ణయం తీసుకోవడం. ప్రతిభగల వారికన్నా చంచా గాళ్ళను నమ్ముకోవడం. వై.ఎస్. అయితే ఇటు ప్రతిభావంతుడైనప్పటికి విధేయత ప్రదర్శిస్తూ వచ్చాడు.

రోశయ్యలాంటి వారు బాత్ రూం పోవాలన్నా అదిష్ఠానం అనుమతి కోరే వారు. ఇక్కడ తెలంగాణా కాలుతుంటే అంతా అదిష్ఠానం చూసుకుంటుందన్నాడు. విలేకర్లు ఎం.ఎల్.ఏ ల రాజినామా గురించి అడిగితే నాకు తెలియదన్న ఘనుడు ఈయన. లౌఖ్యం ఉండొచ్చుగాని అది మరీ మితి మీరితే ఇలానే ఏడుస్తుంది

అటు ఎన్.టి.ఆర్ గాని ఇటు వై.ఎస్. గాని సమైఖ్యాంద్ర ప్రదేశే దేయంగా ఉన్నవారు. తెలంగాణొస్తే ఏమౌతుంది ? కొత్తగా మరో సి.ఎం, మరో క్యేబినెట్, మరో శచివాలయం ప్రజాదనానికి బొక్క అంతేగా
అసలు కే.సి.ఆర్ది ఒక దీక్షేనా ? సెలైన్ అంటే ఏమి ? అది ఫుద్ కాదా. రోజుకి మూడు పూట్ల సెలైన్ ఎక్కించుకుని దీక్షంటూ కథ నడిపితే సోనియా మేడం విరేచణాలయ్యి చిదంబరం చేత ప్రకటణ చెయ్యించింది. అసలు కే.సి.ఆర్ మీద 420 సెక్షన్ క్రింద కేసు పెట్టించాల్సింది. దీక్షని ప్రజలను మోసగించినందుకు. అసలు మీదియావారిని అనాలి. అదో దీక్ష దానికీ కవరేజి

ఇక రాజినామా చేసిన ఇతర పార్టి ఎం.ఎల్.ఏల వివరాలిలా ఉన్నాయి.
తె.దే.పా: 29
పి.ఆర్.పి 11
ఈ క్లీష్ఠ పరిస్థితిలో సోనియా మేడం చెయ్యవలసింది రెండే ఒకటి తెలంగాణ కావాలో వద్దో తెలంగాణా ప్రాంత ప్రజల మద్య వోటింగ్ కు ఆదేశించటం, జగన్ ను సి.ఎం చెయ్యడం. జతిగిన దుష్పరిణామాలన్ని రోశయ్య చేతగాని తనంతోనే జరిగాయి. కనీశం భవిష్యత్త్లో జరుగనున్న నష్ఠాలను వారించటానికన్నా జగన్ ను సి.ఎం చేసి తీరాల్సిందే

గమనిక:
మా చిత్తూరు పురపాలక చేర్మన్ సహా అందరు కౌన్సిలర్లు మూకుమ్మడిగా రాజినామా చేసేరు

Read Full Post »

జగన్ ! మేలుకో ..


డా. వై.ఎస్.పై నాకున్న అభిమానంతో , 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టి విజయానికి కృషి చేసిన హక్కుతో ఈ టపా వ్రాస్తున్నాను. జగన్ బాబు ! రాజకీయం అన్నది ఎన్నికల సమయంలో మాత్రం అందుకునే పాట కాదు. అది అను నిత్యం కొనసాగవలసిన బ్యేక్ గ్రౌండ్ మ్యూజిక్ , ప్రజా సమస్యలనే లిరిక్ ని అనగ త్రొక్కక కొన్సాగుతూనే ఉండాలి.

వై.ఎస్. దివంగతులయ్యారు. నా బోటి వారు నిన్నే సి.ఎం. చేస్తారని ఆశతో ఉన్నాం. మా ఆశ అడియాశైంది. పోనీ తలచినదే జతిగినదా దైవం ఎందులకన్నట్టుగా దీనిని పాజిటివ్ గానే తీసుకుంటాం.
ఇప్పుడు దైనందిన సమస్యలన్నింటిని పక్క దోవ పట్టించి కే.సి.ఆర్ తన దుబాకోరు దీక్షతో తెలంగాణ సమస్యను తెరమీదికి తెచ్చారు. నాకు తెలిసి నాన్న గారు ఈ విషయమై ఏ మాట చెప్పి ఉన్నా ఆయన మనస్సులో మాత్రం సమైక్యాంద్ర ప్రదేశ్ కే చోటు.
రాష్ఠ్ర రాజకీయాల్లో ఇదొక కీలక జంగ్షన్ పాయింట్. ఇక్కట మనమేదో ఒకటి నిర్ణయించుకోవలసిన అవసరం ఉంది. ఇదో ఎత్తైతే మరో ప్రక్క అటు అదిష్ఠాణం కాని , ఇటు సీనియర్లు కాని , ప్రత్యర్దులు కాని సాకు దొరికినప్పుడల్లా నీ మీద దొంగ దెబ్బ కొడుతూనే ఉన్నారు. వారు త్రవ్విన గోతిలో వారే పడటం ఖాయం. సీనియర్లని విర్రవీగే వారికి కుక్కలకున్న జ్ఞానం కూడ లేదు. కుక్క బ్రతుకు బ్రతికినప్పుడు తమ యజమాణి మనోగతాన్ని పసిగట్టి నడుచుకోవాలి. కాని వీరు అధినేత్రి పైనే వత్తిడి తెచ్చే స్థాయికి వెళ్ళి పోయారు. జగన్ బాబు నీవు విధేయత ప్రకటించాలన్నా ఇదే అదను. తిరగబడాలన్నా ఇదే అదను.

అసలే ఇది కలి కాలం నిద్ర పోతునా కాళ్ళాడిస్తూనే ఉండాలి లేకుంటే చచ్చి పోయామని ప్రెస్ మీట్ పెట్టేసే కాలమిది. మరో విషయం ఏమంటే ఇదివరకే ప్రకటించినట్టుగా వై.ఎస్. మరణానంతరం ప్రాణాలు పోగొట్టుకున్నవారి కుటుంభాలను ప్రామర్శించటానికి బయలు దేరాలి. మంచి తనాన్ని చేతగాని తనంగా తీసుకునే వారితో ఎంత మంచిగా
ఉన్నా అది చేతగానితనంగానే పరిగణించ పడుతుంది. జస్ట్ యు కం విత్ అన్ అజెండా . ప్లీస్ బి క్విక్

Read Full Post »


అవును. నేనిదివరకే చెప్పినట్టు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టిని గెలిపించింది సాక్షి పత్రిక & సాక్షి టివియే.అంటే జగన్ బాబే. అటువంటిది జగన్ ఎప్పటికైనా నేనే సి.ఎం అనడం కొంత చేతగాని మాటగా కనిపిస్తూంది. అవును . నేను వై.ఎస్.ఆర్ అభిమానినే. అయితే తొలూత నుండి జగన్ వ్యవహార శైలి నాకు మింగుడు పడటం లేదు. ఒక విదంగా జగన్ రజిని కాంత్ ను తలపిస్తున్నాడు. ఆయనా అంతే తన సినిమా రిలీజ్ అయ్యే సమయానికి ఏదో ఒక టి చెప్పి సంచలనం సౄష్ఠించటం ఆ పై మౌనం వహించటం చేస్తూ ఉంటాడు.

వై.ఎస్. మరణానంతరం జగన్ సి.ఎం. కావాలని రాష్ఠ్రం ముక్త కంఠంతో అంటే , జగన్ సేన, యూత్ కాంగ్రెస్ వారు పెద్ద యెత్తున ఆందోళనలు చేపట్టారు.దీనిని పార్టిలోని కొన్ని ముసలి నక్కలు ఆదిష్ఠానానికి వేరే విదంగా కమ్యూనికేట్ చేసాయి. పోనీ.. వారు చెయ్యాల్సిందే చేసారు. ఆదిష్ఠానానికి జగన్ బాబుకు మద్య అఘాదం ఏర్పడింది. వై.ఎస్.ఆర్ సంతాప సభలో సోనియా పేరెత్తకుండానే జగన్ ప్రసంగించారు. రాజకీయ చదరంగంలో ఇది గొప్ప చెక్. (పైగా తొలూత నుండి టి.వి.కెమరాలకు ఓ జెండా అగుపడుతూనే ఉండే ..అది త్రివర్ణ పతాకము . మద్యలో వై.ఎస్.ఆర్ రూపం ఉండే. వెరి గుడ్ అనుకున్నాను.

కాని డిల్లీనుండి పిలుపందగానే నా భవిష్యత్ సోనియా చేతుల్లో పెట్టానని జగన్ వెను తగారు. ఇదీ ఓకే. వెంబటే ఒక జలక్ ఇచ్చారు. వై.ఎస్. పథకాల అమలుకు ప్రభుత్వం పై వత్తిడి తెస్తా అన్నారు. వెరి వెరి గుడ్.

సోనియాతో తొలి విడత చర్చలంతరం నేను స్వతంత్రించి ఏమి చెప్పలేను . నాన్న గారి సహచరులు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఉన్నారు .వారితో చర్చించి వారిని ఒప్పించి వస్తానని ఫిట్టింగ్ పెట్టుంటే అది రాజకీయం. పోని ఎలానో వ్ధేయత ప్రకతించారు. అదీ గతం గతమే.

కొండా సురేఖ రాజినామా చేసారు. అనంతరం సోనియా వద్దకు జగన్ వెళ్ళి కలిసారు. అప్పుడైనా సురేఖను మళ్ళీ మంత్రి మండలికి తీసుకోవాలని పట్టు పట్టి ఉండాల్సింది.
నేనైతే త్యాగం చేస్తాను. కాని నమ్మిన వారిని ఆదుకోవడం నాన్నగారి సిద్దంతం అందుకు నేను కట్టుబడి ఉంటానని పట్టు పట్టి ఉండాలి.

ఆ పనీ చెయ్యలేదు. కడప టిక్కెట్ విషయంలోనైనా పట్టు పట్టి ఉండాలి. అదీ చెయ్యలేదు.

నేనైతే సెప్టంబరు 14 న ఆయనకో ఉత్తరం పంపాను (కొరియర్ ద్వారా). మీ మద్దత్తు దారులను గవర్నరు వద్దకు తీసుకెళ్ళండి. మెజారిటి సభ్యుల మద్దత్తు లభించకున్నా బాధ లేదు. మేము కాంగ్రెస్ వై.ఎస్.ఆర్ పేరిట వేరే గ్రూపుగా పని చేస్తాం. ప్రస్తుత ప్రభుత్వానికి భయిటనుండి మద్దత్తిస్తామని ప్రకటించండి . కనీశం రీమోట్ అన్నా చేతికొస్తుంది. రానున్న 18 న నిండు అమావాశ్య కావున పంచాంగం పాడూ చూసుకోవలసిన అవసరం కూడ లేదని స్పష్ఠంగా పేర్కొన్నాను.

దీని ప్రతిని ఎం.పీలందరికి మెయిల్ చేసాను. జగన్ సంభంధ వెబ్సైట్స్ కీ పంపాను. కాని ఏం లాభం?

రాజకీయంలో ఎప్పటికైనా అనే మాట చేతగాని మాట. ఎంత పెద్ద లస్ఖ్యానికన్నా తక్కువ డెడ్ లైన్ సూచించాలి. అయితే ఆ డెడ్ లైన్ని నాయకుడు నమ్మరాదు. వాస్తవం తెలిసి ఉండాలి. ( కే.సి.ఆర్ చేసిన పొరభాటు ఇదే. కార్యకర్తలను నమ్మించాల్సింది పోయి తనే నమ్మడం మొదలు పెట్టి పప్పులో కాలేసాడు

కాంగ్రెస్ పార్టి చరిత్ర చూస్తే జగన్ బాబుకు పూర్తిగా అర్థం అవుతుంది .వారి తంతే అందితే జుట్టు, అందకుంటే కాలు చందాన ఉంటుంది. ఇక్కడి మాజి సి.ఎం.కుమారుల పరిస్థితి చూసన్నా జగన్ మేల్కోవాలి.

ఇప్పటికీ మించి పోయిందేమి లేదు ఏదో ఒక డిమాండు రోశయ్యకు పెట్టాలి. డెడ్ లైన్ పెట్టాలి.
( ఉ, సురేఖ విషయ్మే అయినా మంచిదే ) లేకుంటే మేము వేరే గ్రూపుగా చీలి పోతాం. అప్పటికి సోనియానే మా నాయకురాలు. వై.ఎస్. పథకాలకు, వై.ఎస్. వర్గీయులకు హాని జరక్క చూడటమే మా ద్యేయం అని ప్రకటించ వచ్చు.

జగన్ బాబు ఒక్క సారి వేంక్కి తిరిగి చూడండి. వై.ఎస్. పార్థివ దేహం ఉండగా ఎం.ఎల్.ఏల ప్రవర్తన ఎలా ఉండే ? నెలకు ఎలా మారే ? రెండు నేలకు ఎలా మారే ? ఇప్పుడు ఎలా మారే ? ఆలోచించండి. ఇప్పటికే చాలా ఆలశ్యం చేసాం. మీరు సి.ఎం. ఇప్పుడే కాకుంటే పోయే. కాని ఎప్పుడు సె.ఎం.కావాలన్న సంగతి కనీశం మనకన్నా తెలిసి ఉండాలి.

నేను చెప్పిన పని చేస్తే ఎన్నికలు ఎప్పుడు రావాలో ? ఎవరు సి.ఎం.కావాలో నిర్ణయించే పొజిసహ్న్ మీకొస్తుంది.

డా. వై.ఎస్.ఆర్ రహే !

Read Full Post »